ఈ మధ్య కొత్తవని చెప్పే కొన్ని భావాలు, అత్యధికంగా ప్రచారం చేయబడు తున్నాయి. కొన్ని శబ్దజాలాలు వినవస్తూన్నాయి. "సకలమానవ సౌభ్రాతృత్వం" (Fraternity of Mankind) "విశ్వపౌరసత్వం" (World Citizenship) "మానవుని ఆత్మగౌరవం" (Dignity of man) "సామాజిక స్పృహ" (Concern for the society) "మానవతావాదం" (Humanism) "జాతీయవాదం" (Nationalism) - ఇంకా ఇలాంటి శబ్దా లెన్నో ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ కూడా అవాంఛనీయ మని కాని, అనావశ్యక మని కాని కొంచెం ఆలోచనాశక్తి కలవాడెవ్వడూ అనడు. ఇవన్నీ అత్యున్నత మైన ఆదర్శాలే. అసాధ్యాలు కూడా కావు. ఒక మూల ఇలాంటి పదాలు అహోరాత్రులు వల్లె వేస్తుండగానే ప్రపంచం పోకడ మాత్రం ఏతద్విరుద్ధంగా ఉంది. 'ఇది ఇలా జరుగుతున్నదేమి!' అని ఎవరైనా ఆశ్చర్యం ప్రకటిస్తే ఈ పదాలు వల్లే వేసే మేధావు లందరూ "తరాల భేదం" (Generation gap) ఇత్యాది నూతనపదాలేవో తమ ధీశక్తి చేత కనిపెట్టి, తగిన సమాధాన మేదో దొరికిందన్న భావన సామాన్యజనుల మనస్సులలో కలిగిస్తూ, అసలు విషయం దాటవేస్తూ ఉంటారు. జరుగుతూన్న దేమిటంటే ఈ నూతనయుగ ప్రవర్తకులందరూ తమ దృష్టి నంతనీ చాలా "పెద్ద సమస్యలు" వాటంతట అవే చక్కబడతాయనే మాట మరచిపోతూన్నారు.
- ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు