"వివేకచూడామణి" శ్రీ సంకరభాగవత్పాదులవారు రచించిన ప్రమాణ గ్రంధములన్నింటిలోకి అమూల్యమైన వజ్రచితమకుటము. జగద్దురువులు వారి అసామాన్యదంతావిశ్లేషనాగరిమను , పాండిత్యప్రతిభావైవిధ్యమును ప్రదర్శించారనుటలో అతిశయోక్తి లేదు. ఎందరో మహానుభావులు ఈ గ్రంధాన్ని దేశ విదేశీయ భాషలలోకి అనువదించారు. నాకున్న సంస్కృతభాషాప్రవేశము స్వల్పము. శంకరులవారి సూత్రభాష్యమునకు నేను సరళమైన భాషలో ఆధునిక తెలుగు పాఠకులకు అర్ధమయే శైలిలో వ్రాయగా, దానిని రామకృష్ణ మఠం, హైదరాబాద్ శాఖవారు 2012 లో ప్రచురించారు. పిదప నేను శంకరాచార్య విరచిత మరో మూడు ప్రకరణ గ్రంధములకు అనుసృజన చేసి తెలుగు బాషా ప్రియులకు అందించగా వాటికీ మంచి జనాదరణ లభించింది.