Veera Gunnamma Kalinga Sivangi

By Nalli Darmarao (Author)
Rs.100
Rs.100

Veera Gunnamma Kalinga Sivangi
INR
MANIMN4219
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆధునిక మహిళకు గున్నమ్మ ఆదర్శం

మందసా జమిందారీ రైతాంగ పోరాటం, పలాస అఖిల భారత కిసాన్ మహాసభలు, రాజపురం కాల్పులు, హరిపురంలో ఉద్యమ సన్నాహాలు - ఈ చరిత్ర నా నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఒక కోణంలో గర్వంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం అండదండలున్న జమిందార్ను ఎదిరించే శక్తిని, చైతన్యాన్ని అందించిన కిసాన్ మహాసభలు జాతీయ స్థాయిలో జరగడం, దానికి పలాస వేదిక కావడం దేశస్వాతంత్ర్య చరిత్రలో ఓ మహత్తర ఘట్టం. గున్నమ్మ అనే ఓ పేద రైతు బిడ్డ గండ్రగొడ్డలి పట్టుకొని పోలీసులపై, అధికారులపై తిరగబడడం వెనుక ఆత్మాభిమానం అనేది ఎంత బలమైన పాత్ర పోషించిందో అర్థమవుతుంది. ఇది ఆధునిక మహిళకు ఎంతో ఆదర్శవంతమైనది. ఆమె జీవితం, త్యాగం తగిన స్థాయిలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. దీనికి కారణం సమగ్రంగా ఆనాటి పోరాటంలో ఆమెతో పాటు ప్రాణాలు కోల్పోయిన నలుగురి గురించి ఒక స్థూపం తప్ప మరేవిధమైన స్మారక కార్యక్రమం జరగలేదు. నిజానికి, రాజపురం పరిసరాల్లో ఉన్న గ్రామాల వారికే ఆ పోరాట చరిత్ర తెలియదు. గంగిరెడ్ల కళాకారులు పాడుతుంటారని విన్నాం కానీ, మాలాంటి వాళ్లకు ఆ అవకాశం రాలేదు. జర్నలిస్టు, రచయిత నల్లి ధర్మారావు 80 ఏళ్ల తర్వాత గున్నమ్మ జీవితాన్ని ప్రస్తుత తరాలకు నవల రూపంలో అందించడం అభినందనీయం.

శుభాకాంక్షలతో మీ

డాక్టర్ సీదిరి అప్పలరాజు

ఆధునిక మహిళకు గున్నమ్మ ఆదర్శం మందసా జమిందారీ రైతాంగ పోరాటం, పలాస అఖిల భారత కిసాన్ మహాసభలు, రాజపురం కాల్పులు, హరిపురంలో ఉద్యమ సన్నాహాలు - ఈ చరిత్ర నా నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఒక కోణంలో గర్వంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం అండదండలున్న జమిందార్ను ఎదిరించే శక్తిని, చైతన్యాన్ని అందించిన కిసాన్ మహాసభలు జాతీయ స్థాయిలో జరగడం, దానికి పలాస వేదిక కావడం దేశస్వాతంత్ర్య చరిత్రలో ఓ మహత్తర ఘట్టం. గున్నమ్మ అనే ఓ పేద రైతు బిడ్డ గండ్రగొడ్డలి పట్టుకొని పోలీసులపై, అధికారులపై తిరగబడడం వెనుక ఆత్మాభిమానం అనేది ఎంత బలమైన పాత్ర పోషించిందో అర్థమవుతుంది. ఇది ఆధునిక మహిళకు ఎంతో ఆదర్శవంతమైనది. ఆమె జీవితం, త్యాగం తగిన స్థాయిలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. దీనికి కారణం సమగ్రంగా ఆనాటి పోరాటంలో ఆమెతో పాటు ప్రాణాలు కోల్పోయిన నలుగురి గురించి ఒక స్థూపం తప్ప మరేవిధమైన స్మారక కార్యక్రమం జరగలేదు. నిజానికి, రాజపురం పరిసరాల్లో ఉన్న గ్రామాల వారికే ఆ పోరాట చరిత్ర తెలియదు. గంగిరెడ్ల కళాకారులు పాడుతుంటారని విన్నాం కానీ, మాలాంటి వాళ్లకు ఆ అవకాశం రాలేదు. జర్నలిస్టు, రచయిత నల్లి ధర్మారావు 80 ఏళ్ల తర్వాత గున్నమ్మ జీవితాన్ని ప్రస్తుత తరాలకు నవల రూపంలో అందించడం అభినందనీయం. శుభాకాంక్షలతో మీ డాక్టర్ సీదిరి అప్పలరాజు

Features

  • : Veera Gunnamma Kalinga Sivangi
  • : Nalli Darmarao
  • : Madhu Mass Media
  • : MANIMN4219
  • : paparback
  • : 2021
  • : 167
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Veera Gunnamma Kalinga Sivangi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam