ధర్మాన ప్రోత్సాహంతో..
కొల్లాయి గట్టి తేనేమీ మా గాంధీ
కోమటై పుట్టితేనేమీ
మహాత్మాగాంధీ ప్రభావంతో ఒక కవి రచించిన గీతమిది. కోమటిగా పుట్టిన ఆయన ఒక కులానికి పరిమితమైన వారు కాదని భారత జాతికి చెందిన వారని ఆ పాటలో చెప్పారు. ఈ పాట పొట్నూరు స్వామి బాబు గారికి కూడా వర్తిస్తుంది. కళింగ కోమట్లలో పుట్టినా, సమాజానికి అంకితమైన జీవితం అతనిది. వారి మనుమడు కీ.శే. టంకాల బాబీ గారితో సన్నిహితంగా మాట్లాడే కొన్ని సందర్భాల్లో, తమ తాత స్వామి బాబు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక కులానికి, ఒక గ్రామానికి పరిమితమైన వారు కాదని ఎన్నో ఉదాహరణలు చెప్పారు. గాంధీజీ అంత గొప్ప నాయకుడు కాకపోయినా అంతటి విలువల గల జీవితమని అర్ధమయ్యింది. ఎప్పుడైనా ఆయన జీవితం గురించి ఒక పుస్తకం రాయాలనిపించింది. ఈ అంకురార్పణ 2004-05లో పడింది. అనేక కారణాలవల్ల ఆలస్యమైనా రాయడం జరిగింది. అచ్చు వేయడానికి సహాయం చేయాలని ఆత్మీయులు రెవెన్యూ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారికి మొట్టమొదట చెప్పగానే ఆయన చాలా సంతోషించారు. స్వామిబాబు మనుమలు టంకాల బాబీ, గోపాలకృష్ణ గుప్త గారితో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ కళింగ కోమట్లు గర్వించదగిన వ్యక్తి స్వామిబాబు గారు అంటూ, ఆ సామాజికవర్గం వారే ఈ పుస్తకాన్ని అచ్చువేస్తే వారికి కూడా గౌరవం పెరుగుతుందన్నారు. వెంటనే నేరుగా కళింగ కోమట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్నాల శ్రీనివాసరావు (కోణార్క్ శ్రీను) గారికి ఫోన్ చేయడం, ఆయన అంగీకరించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ పుస్తకం వెలుగు చూడటానికి ప్రధాన కారణమైన శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి రచయితగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోణార్క్ శ్రీను గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మొదట ఈ పుస్తకానికి శీర్షిక "కళింగ వైశ్యుల కీర్తి పతాకం " పొట్నూరు స్వామిబాబు అనుకున్నాను. నేను రాసిన చాలా పుస్తకాలకు ముందు మాటలు రాసి, రచయితగా మరికొన్ని ముందడుగులు వేయటానికి ఉత్సాహం, ప్రోత్సాహం.............
ధర్మాన ప్రోత్సాహంతో.. కొల్లాయి గట్టి తేనేమీ మా గాంధీకోమటై పుట్టితేనేమీ మహాత్మాగాంధీ ప్రభావంతో ఒక కవి రచించిన గీతమిది. కోమటిగా పుట్టిన ఆయన ఒక కులానికి పరిమితమైన వారు కాదని భారత జాతికి చెందిన వారని ఆ పాటలో చెప్పారు. ఈ పాట పొట్నూరు స్వామి బాబు గారికి కూడా వర్తిస్తుంది. కళింగ కోమట్లలో పుట్టినా, సమాజానికి అంకితమైన జీవితం అతనిది. వారి మనుమడు కీ.శే. టంకాల బాబీ గారితో సన్నిహితంగా మాట్లాడే కొన్ని సందర్భాల్లో, తమ తాత స్వామి బాబు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక కులానికి, ఒక గ్రామానికి పరిమితమైన వారు కాదని ఎన్నో ఉదాహరణలు చెప్పారు. గాంధీజీ అంత గొప్ప నాయకుడు కాకపోయినా అంతటి విలువల గల జీవితమని అర్ధమయ్యింది. ఎప్పుడైనా ఆయన జీవితం గురించి ఒక పుస్తకం రాయాలనిపించింది. ఈ అంకురార్పణ 2004-05లో పడింది. అనేక కారణాలవల్ల ఆలస్యమైనా రాయడం జరిగింది. అచ్చు వేయడానికి సహాయం చేయాలని ఆత్మీయులు రెవెన్యూ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారికి మొట్టమొదట చెప్పగానే ఆయన చాలా సంతోషించారు. స్వామిబాబు మనుమలు టంకాల బాబీ, గోపాలకృష్ణ గుప్త గారితో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ కళింగ కోమట్లు గర్వించదగిన వ్యక్తి స్వామిబాబు గారు అంటూ, ఆ సామాజికవర్గం వారే ఈ పుస్తకాన్ని అచ్చువేస్తే వారికి కూడా గౌరవం పెరుగుతుందన్నారు. వెంటనే నేరుగా కళింగ కోమట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్నాల శ్రీనివాసరావు (కోణార్క్ శ్రీను) గారికి ఫోన్ చేయడం, ఆయన అంగీకరించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ పుస్తకం వెలుగు చూడటానికి ప్రధాన కారణమైన శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి రచయితగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోణార్క్ శ్రీను గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొదట ఈ పుస్తకానికి శీర్షిక "కళింగ వైశ్యుల కీర్తి పతాకం " పొట్నూరు స్వామిబాబు అనుకున్నాను. నేను రాసిన చాలా పుస్తకాలకు ముందు మాటలు రాసి, రచయితగా మరికొన్ని ముందడుగులు వేయటానికి ఉత్సాహం, ప్రోత్సాహం.............© 2017,www.logili.com All Rights Reserved.