పింగళి సూరన కళాపూర్ణోదయం విశిష్ట ప్రబంధం. తెలుగులో ఇది తొలి కల్పిత కథా ప్రబంధం. చిత్ర విచిత్రంగా కథను అల్లడంలో సూరన గొప్ప నేర్పును చూపించాడు. తెలుగులో విమర్శకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన ప్రబంధం కూడా ఇదే. విమర్శకులు ఈ కావ్యంలోని కథాకల్పన చమత్కృతిని ఒక వైపు మెచ్చుకుంటూనే సాధారణ ప్రబంధాల ధోరణిలో దీనిలో కనిపించే లోపాలను మరోవైపు ఎత్తిచూపడమూ జరిగింది.
కళాపూర్ణోదయం మీదవచ్చిన విమర్శలు, వ్యాఖ్యానాలు, వివరణలు కావ్యంలోని నిజతత్వాన్ని తెలుసుకోవాలనే దృష్టితోనే పరిశీలించవలసి ఉంటుంది. విమర్శకులు చేసిన సూచనలను పరిగణించకపోవటం వలన ఏవైనా సమస్యలు, సందేహాలు సమాధానం లేకుండా మిగిలిపోకుండా చూడాలి. కావ్యరూపాన్ని, వస్తుసమగ్రతను తెలుసుకోవటానికి కవిప్రతిపాదించిన సాహిత్య, సౌందర్య సిద్ధాంతాలు అర్థం చేసుకోవటానికి ఈ విమర్శలు ఎంతవరకు సహాయపడగలవో చూడాలి. ఈ పుస్తకంలో మహాకావ్యం, కళాపూర్ణోదయంలో పాత్రలచిత్రణ, సూరన సౌందర్యదృష్టి - సృష్టి మొదలగు వాటి గురించి స్పష్టంగా తెలియజేశారు కృష్ణారావు గారు.
పింగళి సూరన కళాపూర్ణోదయం విశిష్ట ప్రబంధం. తెలుగులో ఇది తొలి కల్పిత కథా ప్రబంధం. చిత్ర విచిత్రంగా కథను అల్లడంలో సూరన గొప్ప నేర్పును చూపించాడు. తెలుగులో విమర్శకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన ప్రబంధం కూడా ఇదే. విమర్శకులు ఈ కావ్యంలోని కథాకల్పన చమత్కృతిని ఒక వైపు మెచ్చుకుంటూనే సాధారణ ప్రబంధాల ధోరణిలో దీనిలో కనిపించే లోపాలను మరోవైపు ఎత్తిచూపడమూ జరిగింది. కళాపూర్ణోదయం మీదవచ్చిన విమర్శలు, వ్యాఖ్యానాలు, వివరణలు కావ్యంలోని నిజతత్వాన్ని తెలుసుకోవాలనే దృష్టితోనే పరిశీలించవలసి ఉంటుంది. విమర్శకులు చేసిన సూచనలను పరిగణించకపోవటం వలన ఏవైనా సమస్యలు, సందేహాలు సమాధానం లేకుండా మిగిలిపోకుండా చూడాలి. కావ్యరూపాన్ని, వస్తుసమగ్రతను తెలుసుకోవటానికి కవిప్రతిపాదించిన సాహిత్య, సౌందర్య సిద్ధాంతాలు అర్థం చేసుకోవటానికి ఈ విమర్శలు ఎంతవరకు సహాయపడగలవో చూడాలి. ఈ పుస్తకంలో మహాకావ్యం, కళాపూర్ణోదయంలో పాత్రలచిత్రణ, సూరన సౌందర్యదృష్టి - సృష్టి మొదలగు వాటి గురించి స్పష్టంగా తెలియజేశారు కృష్ణారావు గారు.
© 2017,www.logili.com All Rights Reserved.