మానవ హక్కులలో విద్య ప్రధానమైనది. సమాజం అభివృద్ధి సాధించాలంటే ఆ సమాజంలో విద్య విధిగా చోటుచేసుకోవాలి మరియు అట్టి విద్య గుణాత్మకమైన రీతుల్లో చక్కని విలువలతో అందించబడాలి. గిరిజన ప్రాంతాలలో ఇది మరీ ముఖ్యం. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు పరిసరాలనేవి ముఖ్య ధృవాలు. ఈ మూడింటి అనుసంధానంతో విద్య సరైన ప్రేరణతో అందించబడాలి. ఏజెన్సీ ప్రాంత విద్యారంగం చక్కని విలువలతో కూడిన విధంగా ఉండాలన్నదే ప్రధాన ప్రేరిత అంశం. ఎందుకనగా, అభ్యసనా ప్రక్రియలో ప్రేరణ హృదయం వంటిది. ఈ మేరకు కొందరు మహానుభావుల జీవిత ముఖ్య ఘట్టాలను తెలుసుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకుని అదే స్పూర్తితో లక్ష్యాన్ని సాధించాలనే తలంపుతో ముందుకు సాగడం అవసరం. ఈ చిన్న పుస్తకం అందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా ఆశ.
మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ, అదే దిశలో సాగే ప్రయత్నం చేస్తూ, సుఖశాంతులతో వర్ధిల్లే సమాజం మనకు అవసరం. ఇలాంటి నవ అసమాజ నిర్మాణం కోసం మనమంతా సదాలోచన చేస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను. మీరంతా చక్కని విద్యార్థులుగా భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా గుర్తించబడాలని ఆశిస్తున్నాను.
- శశిభూషణ్ కుమార్
మానవ హక్కులలో విద్య ప్రధానమైనది. సమాజం అభివృద్ధి సాధించాలంటే ఆ సమాజంలో విద్య విధిగా చోటుచేసుకోవాలి మరియు అట్టి విద్య గుణాత్మకమైన రీతుల్లో చక్కని విలువలతో అందించబడాలి. గిరిజన ప్రాంతాలలో ఇది మరీ ముఖ్యం. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు పరిసరాలనేవి ముఖ్య ధృవాలు. ఈ మూడింటి అనుసంధానంతో విద్య సరైన ప్రేరణతో అందించబడాలి. ఏజెన్సీ ప్రాంత విద్యారంగం చక్కని విలువలతో కూడిన విధంగా ఉండాలన్నదే ప్రధాన ప్రేరిత అంశం. ఎందుకనగా, అభ్యసనా ప్రక్రియలో ప్రేరణ హృదయం వంటిది. ఈ మేరకు కొందరు మహానుభావుల జీవిత ముఖ్య ఘట్టాలను తెలుసుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకుని అదే స్పూర్తితో లక్ష్యాన్ని సాధించాలనే తలంపుతో ముందుకు సాగడం అవసరం. ఈ చిన్న పుస్తకం అందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా ఆశ. మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ, అదే దిశలో సాగే ప్రయత్నం చేస్తూ, సుఖశాంతులతో వర్ధిల్లే సమాజం మనకు అవసరం. ఇలాంటి నవ అసమాజ నిర్మాణం కోసం మనమంతా సదాలోచన చేస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను. మీరంతా చక్కని విద్యార్థులుగా భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా గుర్తించబడాలని ఆశిస్తున్నాను. - శశిభూషణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.