ఇంతకు ముందు పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించే మహాసామ్రాజ్య స్థాపకులైన అలెగ్జాండర్, జూలియన్ సీజర్, చెంఘిజ్ ఖాన్, ఏకవ్యక్తి పాలకులైన నెపోలియన్, హిట్లర్ జీవిత చరిత్రలు; వారి బలాలు బలహీనతలు గురించి సంగ్రహంగా రాశాను. అయితే వీరిలో చెంఘిజ్ ఖాన్ ఆసియా వాసికాగా తక్కిన వారంతా ఐరోపా వాసులే. ఆ తర్వాత నా మదిలో భారతీయ చరిత్రలో అంతటి గొప్ప పాలకులు లేరా అనే ఆలోచన రేకెత్తింది. అలా పరిశీలించగా 3వ శతాబ్దంలో జన్మించి మొదట చండశోకుడిగా పేరొంది, తర్వాత ఖడ్గం కంటే అహింస, ధర్మపాలన గొప్పవని భావించి అందుకనువైన వర్గ రహిత సమాజం బోధించిన బౌద్ధాన్ని స్వీకరించి సువిశాల భారతావనిని పాలించడమేకాక బౌద్ధమతాన్ని తను తలచిన ధర్మచింతన వ్యాప్తికి మత ప్రచారకులను శ్రీలంక, ఆసియా దాటి గ్రీస్ వరకూ పంపాడు. సుస్థిరపాలన అందించడమే కాక తాననుకున్న ధర్మాన్ని శాసనాల ద్వారా భావితరాలకు అందించిన మహోన్నత చక్రవర్తి అశోకుడు. అతడనుకున్న ధర్మపాలనా భావనలను మీరు చదవాలని ఆశిస్తూ....
- స్వర్ణ
ఇంతకు ముందు పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించే మహాసామ్రాజ్య స్థాపకులైన అలెగ్జాండర్, జూలియన్ సీజర్, చెంఘిజ్ ఖాన్, ఏకవ్యక్తి పాలకులైన నెపోలియన్, హిట్లర్ జీవిత చరిత్రలు; వారి బలాలు బలహీనతలు గురించి సంగ్రహంగా రాశాను. అయితే వీరిలో చెంఘిజ్ ఖాన్ ఆసియా వాసికాగా తక్కిన వారంతా ఐరోపా వాసులే. ఆ తర్వాత నా మదిలో భారతీయ చరిత్రలో అంతటి గొప్ప పాలకులు లేరా అనే ఆలోచన రేకెత్తింది. అలా పరిశీలించగా 3వ శతాబ్దంలో జన్మించి మొదట చండశోకుడిగా పేరొంది, తర్వాత ఖడ్గం కంటే అహింస, ధర్మపాలన గొప్పవని భావించి అందుకనువైన వర్గ రహిత సమాజం బోధించిన బౌద్ధాన్ని స్వీకరించి సువిశాల భారతావనిని పాలించడమేకాక బౌద్ధమతాన్ని తను తలచిన ధర్మచింతన వ్యాప్తికి మత ప్రచారకులను శ్రీలంక, ఆసియా దాటి గ్రీస్ వరకూ పంపాడు. సుస్థిరపాలన అందించడమే కాక తాననుకున్న ధర్మాన్ని శాసనాల ద్వారా భావితరాలకు అందించిన మహోన్నత చక్రవర్తి అశోకుడు. అతడనుకున్న ధర్మపాలనా భావనలను మీరు చదవాలని ఆశిస్తూ.... - స్వర్ణ© 2017,www.logili.com All Rights Reserved.