మనసు ఆత్మలో అణగి విశ్రాంతిగా
వుండటమే సహజస్థితి. కాని,
మన మనసు తద్భిన్నంగా బాహ్య
విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటుంది.
సత్సంగం మనసును హృదయంలో
మునిగేటట్లు చేస్తుంది.
నీ నిజ స్వరూపాన్ని మరవడమే
నీ నిజమైన మరణం. నీ నిజస్థితిని
జ్ఞాపకం వుంచుకోవడమే
నిజమైన జననం.
ఆ స్ఫురణే జనన మరణాలను
అంతమొందిస్తుంది. అప్పుడు నీకు
శాశ్వత జీవనం లభిస్తుంది.
ఇప్పటి నీ స్థితి, సహజస్థితి కాదు
గనక, అది దుర్భరంగా వుంది.
అందుచేత నీకు శాశ్వత జీవితం
మీద కోరిక కలుగుతుంది.
నువ్వు సుఖాన్ని సంపాదించలేవు
అసలు నీ స్వరూపమే, సుఖం,
ఆనందం కొత్తగా పొందేది కాదు.
చేయవలసింది, దుఃఖాన్ని
తొలగించడం. దుఃఖనివారణకు
ఆత్మవిచారణ పద్దతి సహాయం
చేస్తుంది.
© 2017,www.logili.com All Rights Reserved.