ఒక మనిషి తన శరీరంలో ఎంతవరకూ రక్త మాంసాలని కలిగి ఉంటాడో అంతవరకూ తన అహాన్ని వదులుకోలేడు. ఎవరూ జీవించి ఉన్నంతకాలం పరిపూర్ణులు కాలేరు.
"భలే తాత బాపూజీ బాలలతాత బాపూజీ' అనే పాట మీరెప్పుడైనా విన్నారా?
బాపూజీ అంటే మన దేశానికీ స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంథీ అని మీ అందరికీ తెలుసు. మీ ఊళ్ళోని అన్ని పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, న్యాయ స్థానాల్లోనూ బాపూజీ ఛాయా చిత్రాన్ని మీరందరూ చూసే ఉంటారు. ఆయన బోసినవ్వు, బోడి గుండు, పెద్ద పెద్ద చెవులు, చత్వారం కళ్ళజోడూ, వాటి వెనుకనుండీ ప్రేమగా చూసే లోతైన కళ్లూ, తెల్లటి మీసాలూ, గోచిపోసి కట్టిన ఖద్దరు పంచె, ఆయన రొంటిన వ్రేలాడే గడియారం అన్నీ మీకు పరిచయమైనవే. అయన పుట్టిన రోజయిన అక్టోబరు రెండవ తారీకునాడు మీరంతా తోటి విద్యార్థులతో కలిసి గాంథీ జయంతిని జరుపుకున్నారు కదా? మరి ఆ బాలల తాత గురించి తెలుసుకుందామా?
- జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

Features
: Bhale Tata Mana Baapuji
: Bolwar Mahamad Kunhi S Jonnavitthula Sree Ramachandra Murthy