డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి సాహిత్య జీవితాన్ని చూస్తే కేరళ రాష్ట్ర గవర్నరుగా నియమితులైన కాలంలో సాహిత్య వ్యాసంగం ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా ఆ సమయంలో ఎక్కువ తీరిక కలిగిందికావచ్చు. 'పండితరాజ పంచామృతం' ఆ కాలంలోనే అచ్చయినట్లు గుర్తు. పూర్వం సమాజంలో ప్రసిద్ధ వ్యక్తులందరూ ఒకటికిమించిన రంగాలలో అభిలాష కలవారుగా, నిష్ణాతులుగా కనిపిస్తారు. అదే విధంగా శ్రీ బూర్గులవారు - అటు రాజకీయాలతోపాటు, ఇటు సాహిత్య వ్యాసంగం పట్లా అభిరుచిని కలిగినవారు. వీరిలో విశేషమేమంటే తేలుగుతోపాటు సంస్కృతం, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీషు భాషాబంధురంగా జాతీయ, అంతర్జాతీయ సమైక్యతా స్ఫూర్తితో విశ్వభావనా బంధురంగా వీరి వ్యక్తిత్వం నిర్మితమై ఉంది.
- ఆచార్య మాదిరాజు రంగారావు
"బహుభాషావేత్త. స్వాతంత్రోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది, మేధావి. అతిపిన్నవయసు నుండే రాజనీతి విశారదుడుగా, మహావక్తగా ఎదిగి ఆవేశం, కవ్వింపుదానం, అధిక్షేపం లాంటి వాక్కులుకాక; కేవలం చతురత, సంయమనంతో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ప్రకటించిన తొణుకూబెణుకూ లేని రాజకీయనాయకుడు". "మాతృభాషలో విద్యాబోధనా చెయ్యడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ నిజాం ప్రభుత్వం ఉర్దూను బోధనాభాషగా అమలుచేస్తుంది. అటువంటప్పుడు ఉర్దూ మాతృభాషకాని తెలుగు వారికి ఉర్దూలో ఎందుకు బొదిస్తున్నా"రని నిజాం ప్రభుత్వాన్ని సభాముఖంగా ప్రశ్నించగలిగిన ధీశాలి బూర్గుల రామకృష్ణారావు.
డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి సాహిత్య జీవితాన్ని చూస్తే కేరళ రాష్ట్ర గవర్నరుగా నియమితులైన కాలంలో సాహిత్య వ్యాసంగం ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా ఆ సమయంలో ఎక్కువ తీరిక కలిగిందికావచ్చు. 'పండితరాజ పంచామృతం' ఆ కాలంలోనే అచ్చయినట్లు గుర్తు. పూర్వం సమాజంలో ప్రసిద్ధ వ్యక్తులందరూ ఒకటికిమించిన రంగాలలో అభిలాష కలవారుగా, నిష్ణాతులుగా కనిపిస్తారు. అదే విధంగా శ్రీ బూర్గులవారు - అటు రాజకీయాలతోపాటు, ఇటు సాహిత్య వ్యాసంగం పట్లా అభిరుచిని కలిగినవారు. వీరిలో విశేషమేమంటే తేలుగుతోపాటు సంస్కృతం, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీషు భాషాబంధురంగా జాతీయ, అంతర్జాతీయ సమైక్యతా స్ఫూర్తితో విశ్వభావనా బంధురంగా వీరి వ్యక్తిత్వం నిర్మితమై ఉంది. - ఆచార్య మాదిరాజు రంగారావు "బహుభాషావేత్త. స్వాతంత్రోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది, మేధావి. అతిపిన్నవయసు నుండే రాజనీతి విశారదుడుగా, మహావక్తగా ఎదిగి ఆవేశం, కవ్వింపుదానం, అధిక్షేపం లాంటి వాక్కులుకాక; కేవలం చతురత, సంయమనంతో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ప్రకటించిన తొణుకూబెణుకూ లేని రాజకీయనాయకుడు". "మాతృభాషలో విద్యాబోధనా చెయ్యడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ నిజాం ప్రభుత్వం ఉర్దూను బోధనాభాషగా అమలుచేస్తుంది. అటువంటప్పుడు ఉర్దూ మాతృభాషకాని తెలుగు వారికి ఉర్దూలో ఎందుకు బొదిస్తున్నా"రని నిజాం ప్రభుత్వాన్ని సభాముఖంగా ప్రశ్నించగలిగిన ధీశాలి బూర్గుల రామకృష్ణారావు.
© 2017,www.logili.com All Rights Reserved.