ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటానికి ప్రజాస్వామ్య విలువలు కలిగిన ప్రజలుండటం అవసరం. మంచి సాహిత్యం అనడానికి మంచి పాఠకులుండటం అవసరం. కేవలం సాహిత్యాన్ని కాపాడుకోలేరు. దాన్ని సమకాలికం చేయ్యనూ లేరు. సాహిత్యం సార్వకాలికం అయ్యేందుకు రచయిత శ్రమ కన్నా పాఠకుడి చైతన్యమే ప్రదానమన్నా తప్పులేదేమో! కాదంటే, ఆ రెండు పరస్పర ప్రభావితాలు. సాహిత్యానికి పాఠకుల సంఖ్యా తగ్గుతోందంటే ఆ మేరకు మనిషిలో ఉండవలసిన సహజ స్పందన తగ్గుతోందనే అర్థం పాఠకులకూ, మనుషులకూ అభేదం పాటించడమెందుకంటే, సాహిత్య ప్రభావం అక్షరాస్యతకూ, నిరక్షరాస్యతకూ అతీతంగా స్పందననిస్తుంది కనుక. మనిషిలో స్పందన తగ్గడం వినాశకరమని వేరే చెప్పనవసరం లేదు. ఆ ప్రమాద నివారణకు చెయ్యవలసిందేమిటి? చైతన్యవంతులైన పాఠకులు సాహిత్యాన్ని నిత్య చైతన్యంగా చేసుకోవడమే.
"ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును", చైతన్యమిచ్చిన చైతన్యం వచ్చును.
రాయలసీమలో ఋతుపవనాలు ఆధారంగా నడిచే వ్యవసాయ జీవితం గురించి చెప్పాలనుకొని, కాల్పనిక ధోరణిలో చెప్పాను. రాయలసీమ రైతుజీవితం ఋతుపవనాల ప్రభావితం అన్నంత వరకే దీని ప్రాసంగికత అని భావిస్తున్నాను.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటానికి ప్రజాస్వామ్య విలువలు కలిగిన ప్రజలుండటం అవసరం. మంచి సాహిత్యం అనడానికి మంచి పాఠకులుండటం అవసరం. కేవలం సాహిత్యాన్ని కాపాడుకోలేరు. దాన్ని సమకాలికం చేయ్యనూ లేరు. సాహిత్యం సార్వకాలికం అయ్యేందుకు రచయిత శ్రమ కన్నా పాఠకుడి చైతన్యమే ప్రదానమన్నా తప్పులేదేమో! కాదంటే, ఆ రెండు పరస్పర ప్రభావితాలు. సాహిత్యానికి పాఠకుల సంఖ్యా తగ్గుతోందంటే ఆ మేరకు మనిషిలో ఉండవలసిన సహజ స్పందన తగ్గుతోందనే అర్థం పాఠకులకూ, మనుషులకూ అభేదం పాటించడమెందుకంటే, సాహిత్య ప్రభావం అక్షరాస్యతకూ, నిరక్షరాస్యతకూ అతీతంగా స్పందననిస్తుంది కనుక. మనిషిలో స్పందన తగ్గడం వినాశకరమని వేరే చెప్పనవసరం లేదు. ఆ ప్రమాద నివారణకు చెయ్యవలసిందేమిటి? చైతన్యవంతులైన పాఠకులు సాహిత్యాన్ని నిత్య చైతన్యంగా చేసుకోవడమే. "ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును", చైతన్యమిచ్చిన చైతన్యం వచ్చును. రాయలసీమలో ఋతుపవనాలు ఆధారంగా నడిచే వ్యవసాయ జీవితం గురించి చెప్పాలనుకొని, కాల్పనిక ధోరణిలో చెప్పాను. రాయలసీమ రైతుజీవితం ఋతుపవనాల ప్రభావితం అన్నంత వరకే దీని ప్రాసంగికత అని భావిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.