శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాల గురించీ - ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్నా అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది. హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైనా, మతమౌడ్యపు దౌర్బల్యాలపైనా సమరం, సాగించిన ఉద్యమ శక్తుల సమాహారం నాకు 'ఆది రుద్రాంధ్ర మహోద్యమం' గా దృశ్యమానమవుతుంది.
ఆ మహోద్యమంలో ఎన్నో విస్ఫులింగాలు - ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగవలసి ఉంది. ఇది అవిశ్రాంతం - దీనికి విరామం లేదు - ఉండటానికి ఆస్కారమూ లేదు. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని వివరిస్తూ... ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్వాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.
శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాల గురించీ - ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్నా అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది. హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైనా, మతమౌడ్యపు దౌర్బల్యాలపైనా సమరం, సాగించిన ఉద్యమ శక్తుల సమాహారం నాకు 'ఆది రుద్రాంధ్ర మహోద్యమం' గా దృశ్యమానమవుతుంది. ఆ మహోద్యమంలో ఎన్నో విస్ఫులింగాలు - ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగవలసి ఉంది. ఇది అవిశ్రాంతం - దీనికి విరామం లేదు - ఉండటానికి ఆస్కారమూ లేదు. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని వివరిస్తూ... ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్వాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.