'అందరి మనిషి' లోని కథలను శశిశ్రీ 2011 -2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. మొత్తం మీద శశిశ్రీ ఇరవయ్యో శతాబ్దం చివర్లో కథలు రాయడం ప్రారంభించి, 21వ శతాబ్దంలోనే ఎక్కువ రాశారని చెప్పవచ్చు. ప్రచురణ రచన వివరాలు తెలిస్తే సరైన నిర్ణయం చేయడానికి వీలవుతుంది. 'రాతిలో తేమ' కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి అంతర్లోకం, బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాలమీద రాసినవి బహిర్లోకం. 'అందరి మనిషి' లోని పదకొండు కథలను పూర్తిగా కూడా అలాగే విభజించుకోవచ్చు. 'పెద్దలపండగ', 'పురానా హవేలీ', పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, 'ఆరాత్రి ఆపాట', 'ఫో', 'అరుపు' హిందుముస్లిం సంబంధ కథలు, 'గుండెతడి', 'అందరి మనిషి', 'కిర్రు చెప్పులు', 'ఎమ్టీఫెలో', 'గురువింద', 'కూపం', ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.
'అందరి మనిషి' లోని కథలను శశిశ్రీ 2011 -2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. మొత్తం మీద శశిశ్రీ ఇరవయ్యో శతాబ్దం చివర్లో కథలు రాయడం ప్రారంభించి, 21వ శతాబ్దంలోనే ఎక్కువ రాశారని చెప్పవచ్చు. ప్రచురణ రచన వివరాలు తెలిస్తే సరైన నిర్ణయం చేయడానికి వీలవుతుంది. 'రాతిలో తేమ' కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి అంతర్లోకం, బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాలమీద రాసినవి బహిర్లోకం. 'అందరి మనిషి' లోని పదకొండు కథలను పూర్తిగా కూడా అలాగే విభజించుకోవచ్చు. 'పెద్దలపండగ', 'పురానా హవేలీ', పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, 'ఆరాత్రి ఆపాట', 'ఫో', 'అరుపు' హిందుముస్లిం సంబంధ కథలు, 'గుండెతడి', 'అందరి మనిషి', 'కిర్రు చెప్పులు', 'ఎమ్టీఫెలో', 'గురువింద', 'కూపం', ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.© 2017,www.logili.com All Rights Reserved.