మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు.
ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.
మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు. ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.© 2017,www.logili.com All Rights Reserved.