చింతనాగ్ని చల్లారుతున్న వేళ ఒక సమాజం ఎలా ఉంటుందో, ఇప్పుడు మనమంటున్న సమాజాన్ని చూస్తే తెలుస్తుంది. తెలుగు వారికి ఒక ఔన్నత్యంతో కూడిన బౌద్ధిక మేథోవరణం ఇంకా పరిణత దశను అందుకోలేదు. సమాజం, సంబంధాలు, విలువలు మారుతున్నప్పుడల్లా తెలుసు సమాజం కుదుపులకి గురయింది తప్ప, విశ్లేషణకి, వివేచనకే ప్రయత్నించలేదు. ఈ విషయమై వ్యక్తమైన చైతన్యం కూడా వివిధ జెండాలు, కులాలు, సమూహాలు, వైయక్తికాలుగా పాక్షికమై, ద్రుష్టిగతమైందని చెప్పాలి. సమాజంలో నెలకొంటున్న 'బాహుళత' ని పట్టుకోవడంలో తెలుగు బౌద్ధిక వాతావరణం వెనుక పడిందేనని చెప్పుకోవాలి.
ఈ పుస్తకంలో అన్నపరెడ్డి ఏనాడో చర్చించిన సమస్యలకు, ఈనాటికీ ప్రాసంగికత ఉంది. అసహనం, తెలుగు తల్లిపూజ, వందేమాతర గీతాలాపన, సరస్వతీపూజ, హిందూస్థాన్ వర్సెస్ సంఘిస్థాన్ వంటి నేటి ధోరణులు మూలాలను ఒకటి రెండు దశాబ్దాల క్రితమే అన్నపరెడ్డి ప్రస్తావించి రాశారు.
చింతనాగ్ని చల్లారుతున్న వేళ ఒక సమాజం ఎలా ఉంటుందో, ఇప్పుడు మనమంటున్న సమాజాన్ని చూస్తే తెలుస్తుంది. తెలుగు వారికి ఒక ఔన్నత్యంతో కూడిన బౌద్ధిక మేథోవరణం ఇంకా పరిణత దశను అందుకోలేదు. సమాజం, సంబంధాలు, విలువలు మారుతున్నప్పుడల్లా తెలుసు సమాజం కుదుపులకి గురయింది తప్ప, విశ్లేషణకి, వివేచనకే ప్రయత్నించలేదు. ఈ విషయమై వ్యక్తమైన చైతన్యం కూడా వివిధ జెండాలు, కులాలు, సమూహాలు, వైయక్తికాలుగా పాక్షికమై, ద్రుష్టిగతమైందని చెప్పాలి. సమాజంలో నెలకొంటున్న 'బాహుళత' ని పట్టుకోవడంలో తెలుగు బౌద్ధిక వాతావరణం వెనుక పడిందేనని చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో అన్నపరెడ్డి ఏనాడో చర్చించిన సమస్యలకు, ఈనాటికీ ప్రాసంగికత ఉంది. అసహనం, తెలుగు తల్లిపూజ, వందేమాతర గీతాలాపన, సరస్వతీపూజ, హిందూస్థాన్ వర్సెస్ సంఘిస్థాన్ వంటి నేటి ధోరణులు మూలాలను ఒకటి రెండు దశాబ్దాల క్రితమే అన్నపరెడ్డి ప్రస్తావించి రాశారు.© 2017,www.logili.com All Rights Reserved.