తెలివైన ప్రతివాడు మేధావికాడు. తన మేధస్సుతో మానవాళి ఆలోచన విధానంలో, దృక్పథంలో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే వాడే మేధావి. అటువంటి మేధావులను వారి వ్యక్తీగత విషయాలను ఈ గ్రంధంలో చేర్చడం జరిగింది.
ఇంతకు ముందరి యుగాల్లో మతాచార్యులు, దైవజ్ఞులు, పూజారులు, ప్రవక్తులు సమాజాన్ని నడిపించారు. ఏలారు. మలిచారు. వారి ప్రభ కొడిగట్టింది. ఆ శూన్యాన్ని పూరించడానికి ఆధునిక చింతనలు (Modern Thinkers) రంగప్రవేశం చేశారు.
వారి సిద్ధాంతాలను గూర్చి లోకానికి బాగా తెలుసు. కొత్తగా చెప్పవలసింది ఏమిలేదు. అయితే మార్గనిర్దేశకత్వానికి వారికి ఉన్న అర్హతలు ఏమిటి? సత్యం, నిజాయితీలు అంటే వారికి ఉన్న గౌరవం ఏపాటి? ఆ సత్యాన్ని వారెలా చేరారు? భార్యబిడ్డలకు, స్నేహితులకు వారిచ్చే విలువ ఏపాటి? వారి అంతరంగ, బాహ్యజీవితాల మధ్య అంతరం ఎంత? చిత్తశుద్ధిలేనివారు మేధావులైనా వారిని గౌరవించలేముకదా. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ గ్రంథం.
రచయిత గురించి :
శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 1933 ఫిబ్రవరి 22వ తేదీ మహాశివరాత్రి నాడు, నాటి తెనాలి, తాలూకా, తూములూరు గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం కొల్లిపర హైస్కూల్లో, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం వాల్తేరు (విశాఖపట్నం) లలో. చదివింది తత్వశాస్త్రం, బోధించింది సమాజశాస్త్రం, రాసింది మనోవిజ్ఞాన శాస్త్రం, అభిమాన విషయం సాహిత్యం, గ్రంథరచన. అధ్యాపకత్వం వి.యస్.ఆర్. కళాశాల తెనాలిలో (1957 - 64), జె.కె.సీ. కళాశాల, గుంటూరు (1977 - 78), వి.యస్.ఆర్ & యన్.వి.ఆర్. కళాశాల, తెనాలి (1980 - 81). పదవీ విరమణ 91 జూలైలో. తరువాత విజ్ఞాన్ డిగ్రీ కళాశాల, వడ్లమూడి, (1991 - 93)లలో. 'మిసిమి' పత్రిక సంపాదకులుగా 1996 నుంచీ (అధికారికంగా ఏప్రిల్ నుంచీ) 2011 మే వరకు.
- అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
తెలివైన ప్రతివాడు మేధావికాడు. తన మేధస్సుతో మానవాళి ఆలోచన విధానంలో, దృక్పథంలో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే వాడే మేధావి. అటువంటి మేధావులను వారి వ్యక్తీగత విషయాలను ఈ గ్రంధంలో చేర్చడం జరిగింది. ఇంతకు ముందరి యుగాల్లో మతాచార్యులు, దైవజ్ఞులు, పూజారులు, ప్రవక్తులు సమాజాన్ని నడిపించారు. ఏలారు. మలిచారు. వారి ప్రభ కొడిగట్టింది. ఆ శూన్యాన్ని పూరించడానికి ఆధునిక చింతనలు (Modern Thinkers) రంగప్రవేశం చేశారు. వారి సిద్ధాంతాలను గూర్చి లోకానికి బాగా తెలుసు. కొత్తగా చెప్పవలసింది ఏమిలేదు. అయితే మార్గనిర్దేశకత్వానికి వారికి ఉన్న అర్హతలు ఏమిటి? సత్యం, నిజాయితీలు అంటే వారికి ఉన్న గౌరవం ఏపాటి? ఆ సత్యాన్ని వారెలా చేరారు? భార్యబిడ్డలకు, స్నేహితులకు వారిచ్చే విలువ ఏపాటి? వారి అంతరంగ, బాహ్యజీవితాల మధ్య అంతరం ఎంత? చిత్తశుద్ధిలేనివారు మేధావులైనా వారిని గౌరవించలేముకదా. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ గ్రంథం. రచయిత గురించి : శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 1933 ఫిబ్రవరి 22వ తేదీ మహాశివరాత్రి నాడు, నాటి తెనాలి, తాలూకా, తూములూరు గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం కొల్లిపర హైస్కూల్లో, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం వాల్తేరు (విశాఖపట్నం) లలో. చదివింది తత్వశాస్త్రం, బోధించింది సమాజశాస్త్రం, రాసింది మనోవిజ్ఞాన శాస్త్రం, అభిమాన విషయం సాహిత్యం, గ్రంథరచన. అధ్యాపకత్వం వి.యస్.ఆర్. కళాశాల తెనాలిలో (1957 - 64), జె.కె.సీ. కళాశాల, గుంటూరు (1977 - 78), వి.యస్.ఆర్ & యన్.వి.ఆర్. కళాశాల, తెనాలి (1980 - 81). పదవీ విరమణ 91 జూలైలో. తరువాత విజ్ఞాన్ డిగ్రీ కళాశాల, వడ్లమూడి, (1991 - 93)లలో. 'మిసిమి' పత్రిక సంపాదకులుగా 1996 నుంచీ (అధికారికంగా ఏప్రిల్ నుంచీ) 2011 మే వరకు. - అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.