సవ్వప్ప గారి ఈరన్న నాకెప్పుడూ సంచలనాల ఈరన్న గానే కనిపిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా నిత్యం తిరుగుతూనే వుంటారు. ఆ తిరుగుడంతా కూడా తన రాతల గురించే. ఆ రాతలెప్పుడు చెడుగు తలరాతలు మార్చేవిగానే ఉండడం విశేషం. ఇక "దళిత పద్యకవులు" అన్న పుస్తకము రాయటం మొదలు పెట్టేముందు కవులను సూచించమంటే కొందరి పేర్లు చెప్పడం జరిగింది. పుస్తకములో సాంప్రదాయ కవులను పరిచయం చేసినా వారంతా అభ్యుదయ వాదులే. ఏటికి ఎదురీది వ్యక్తిత్వాన్ని కాపాడుకుని శిఖరాలనెన్నటినో అధిరోహించి గండ పెండేరము తొడిగించుకున్న జాషువ గారితో మొదలు పెట్టిన ఈ పుస్తకము అభిమాన ధనుల మూలధనంగా నిలిచిపోతుంది. గుర్రం జాషువా అంటే నా హృదయం పులకించి పోతుంది. సాంప్రదాయ కవులను ప్రత్యేకంగా పరిచయంచేయడం వాళ్ళ వారెవ్వరికి ఎందులోనూ తీసిపోరని సవ్వప్పగారి ఈరన్న చెప్పకనే చెప్పారు. ఇందులోని కవులంతా ఉద్దండులే. ఇదే విధమైన పుస్తకము దళిత వచన కవులపైన తేవలసిన బాధ్యత. తేగల పట్టుదల నేను శ్రీ సవ్వప్ప గారి ఈరన్న లో ఉందని నమ్ముతున్నాను. సంచలనాల ఈరన్న గారు మాత్రమే ఆ పనిచేయగలరు.
ఇక అవార్డులు, బిరుదులు, సన్మానాలు పొందడం మాములుగా మరీనా "కళానిధి" బిరుదును ఆదోని లోని "శ్రీ లలిత కళా సేవ సంస్థ" అధినేత డా జి. నల్లా రెడ్డి గారి ఆధ్వర్యమున, గురువర్యులైన "జనప్రియకవి" శ్రీ ఏలూరు యంగన్న కవి గారి "కళాతపస్వి" డా ఆశావాది ప్రకాశ రావు గారి ఆశీర్వాదములతో... వారి సమక్షములో అందుకోవడం సముచితంగా వుందని నా అభిప్రాయం. సవ్వప్ప గారి ఈరన్న ను నేడు కర్నూలు జిల్లా కవిత్వానికి పెద్దాయనగా స్తుతిస్తున్నాను. అయన పై నాలుగు వాక్యాలు వ్రాయడం నా అదృష్టం. వారికీ అభినందనలు కృతఙ్ఞతలు శుభాకాంక్షలు.
- కళానిధి సవ్వప్ప గారి ఈరన్న