ఆధునికాంద్ర కవిత్వం అనగానే అందరికీ మొదట వచన కవిత్వం గుర్తుకువస్తుంది. కాని పద్యకవిత్వంగాని, గేయ కవిత్వంగాని గుర్తుకు రావడం కష్టం.... ఆధునికాంద్ర కవిత్వం 20వ శతాబ్దపు తోలి నాళ్లలో పద్యకవిత్వం, గేయ కవిత్వం రూపంలో రంగ ప్రవేశం చేసింది. ఇంచుమించు చాలాకాలం పైచేయిగా ఉండింది. తరువాత వచన కవితారూపం రంగప్రవేశం చేసి పలుపోకడలు పోయింది. ఎందరో వచన కవితా కవుల్ని పరిచయం చేసింది.
1950 తరువాత అభ్యుదయ కవిత్యోద్యమం సాగుతూ ఉండగానే నూతనోద్యమాలు వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో చెప్పుకోదగింది "దిగంబర కవిత్వం". తరువాత వచ్చిన విప్లవ కవిత్వం, "విరసం" కవిత్వంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.
స్త్రీవాద కవిత్వం, దళితకవిత్వం, ముస్లిం కవిత్వం, బి.సి. కవిత్వం, ప్రాంతీయవాద కవిత్వం మొదలైన కవితారీతులు ఇటీవలికాలంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి.పద్యం,గేయం, వచన కవిత్వం మొదలైన కవితారీతులు స్థానే మినీకవిత, నానీలు, హైకూలు మొదలైన కవితారీతులు ప్రచురితమౌతున్నాయి. ఈ విధంగా ఆధునికాంద్ర కవిత్వంలో, భాషలో, భావనలో, శిల్పంలో, రచనా విధానంలో ఎన్నో మార్పులు ఈ శతాబ్దంలో చోటు చేసుకున్నాయి.
ఈ గ్రంధంలో పరిచయం చేసిన కవులందరూ కీర్తి శేషులే! గురజాడ తో ప్రారంభించి కాలానుగుణంగా(ఆయా కవుల జన్మించిన తేదిల వలన)..... నీలా జంగయ్య వరకు ఇలా 51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలను పరిచయం చేయడం జరిగింది.
ఆధునికాంద్ర కవిత్వం అనగానే అందరికీ మొదట వచన కవిత్వం గుర్తుకువస్తుంది. కాని పద్యకవిత్వంగాని, గేయ కవిత్వంగాని గుర్తుకు రావడం కష్టం.... ఆధునికాంద్ర కవిత్వం 20వ శతాబ్దపు తోలి నాళ్లలో పద్యకవిత్వం, గేయ కవిత్వం రూపంలో రంగ ప్రవేశం చేసింది. ఇంచుమించు చాలాకాలం పైచేయిగా ఉండింది. తరువాత వచన కవితారూపం రంగప్రవేశం చేసి పలుపోకడలు పోయింది. ఎందరో వచన కవితా కవుల్ని పరిచయం చేసింది. 1950 తరువాత అభ్యుదయ కవిత్యోద్యమం సాగుతూ ఉండగానే నూతనోద్యమాలు వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో చెప్పుకోదగింది "దిగంబర కవిత్వం". తరువాత వచ్చిన విప్లవ కవిత్వం, "విరసం" కవిత్వంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. స్త్రీవాద కవిత్వం, దళితకవిత్వం, ముస్లిం కవిత్వం, బి.సి. కవిత్వం, ప్రాంతీయవాద కవిత్వం మొదలైన కవితారీతులు ఇటీవలికాలంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి.పద్యం,గేయం, వచన కవిత్వం మొదలైన కవితారీతులు స్థానే మినీకవిత, నానీలు, హైకూలు మొదలైన కవితారీతులు ప్రచురితమౌతున్నాయి. ఈ విధంగా ఆధునికాంద్ర కవిత్వంలో, భాషలో, భావనలో, శిల్పంలో, రచనా విధానంలో ఎన్నో మార్పులు ఈ శతాబ్దంలో చోటు చేసుకున్నాయి. ఈ గ్రంధంలో పరిచయం చేసిన కవులందరూ కీర్తి శేషులే! గురజాడ తో ప్రారంభించి కాలానుగుణంగా(ఆయా కవుల జన్మించిన తేదిల వలన)..... నీలా జంగయ్య వరకు ఇలా 51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలను పరిచయం చేయడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.