భారతీయ సామాజిక వ్యవస్థ తక్కిన దేశాలన్నింటికంటే ప్రాచీనమైనది, మహోన్నతమైనదని చారిత్రక పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికి దాదాపు నాలుగు వేల ఏండ్ల క్రితమే, అనగా ఈజిప్టు, గ్రీసు, మెసపొటేమియా, సుమేరియా వంటి ప్రాచీన దేశాలు బ్రతికి బట్టగట్టక పూర్వమే, భారతదేశంలో అత్యున్నతమైన నాగరికతా సంస్కృతులతో గూడిన సామాజిక వ్యవస్థ సమస్తమైన సిరిసంపదలతో విలసిల్లుతుండినట్లు చారిత్రక సత్యాలు ఋజువు జేస్తున్నవి. ఆనాటి భారతీయ వ్యవస్థలో కులాలనేవి లేనేలేవు!
ఆర్యుల దండయాత్రతో ఈ పరిస్థితి తారుమారైంది. ఈ ఆర్యులనబడే వారు మధ్య ఆసియా, మధ్య ఐరోపా ప్రాంతాల నుండి పొట్ట చేతబట్టుకొని భారతదేశానికి వలసలు బయల్దేరి వచ్చినట్లు చారిత్రక పరిశీలకులు భావిస్తున్నారు'. ఆర్యుల సంతతికి చెందిన కాశ్యపముని కాస్పియన్ సముద్రతీర ప్రాంతీయుడనీ, అదే విధంగ దూర్వాసుడు తురేనియన్ వంశీయుడనీ చారిత్రక పరిశోధకుల వాదన. అగస్త్యుడు అంటే వూరూ పేరూ లేనివాడని అర్ధం. ఆర్యుల పుట్టు పూర్వోత్తరాలపై సమగ్రమైన పరిశోధన జరిపిన మీదట వీరు నార్డిక్ తెగకు చెందినవారనీ; రైనునది, కాస్పియన్ సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తూండేవారని ప్రఖ్యాత చరిత్రకారుడైన హెచ్.జి. వెల్స్ పేర్కొన్నాడు. ఆర్యుల ఆచార వ్యవహారాలను గూర్చి హెచ్.జి.వెల్స్ ఇంకా ఇలా వ్రాశాడు". "ఆర్యులకు మాటకారి తనం జాస్తి, అర్ధనగ్నంగా తయారై తప్పత్రాగి పాటలు పాడుతూ, గంతులు వేయడమంటే వీరికి ఆసక్తి ఎక్కువ. ఆనాటి వీరి భాషకు లిపి అంటూ లేకపోవడం వల్లనే వీరి పూర్వ చరిత్రనంతా పాటల రూపంలోనే వ్యక్తం జేస్తుండేవారు.”
ఆర్యుల దండయాత్రకు పూర్వం ద్రావిడులనబడే జాతులవారు ఉత్తర భారతంలో నివసిస్తూ ఉండేవారు. ఆసియా మైనర్ ప్రాంతానికి చెందిన త్రమీల్ జాతులవారే ఉత్తర భారతంలోని గంగా, సింధూ ప్రాంతాల్లో స్థిరపడి విశేష విజ్ఞాన సంపన్నులై గొప్ప పట్టణాలనే.................................
మొదటి ప్రకరణము ఆదిమజాతులు భారతీయ సామాజిక వ్యవస్థ తక్కిన దేశాలన్నింటికంటే ప్రాచీనమైనది, మహోన్నతమైనదని చారిత్రక పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికి దాదాపు నాలుగు వేల ఏండ్ల క్రితమే, అనగా ఈజిప్టు, గ్రీసు, మెసపొటేమియా, సుమేరియా వంటి ప్రాచీన దేశాలు బ్రతికి బట్టగట్టక పూర్వమే, భారతదేశంలో అత్యున్నతమైన నాగరికతా సంస్కృతులతో గూడిన సామాజిక వ్యవస్థ సమస్తమైన సిరిసంపదలతో విలసిల్లుతుండినట్లు చారిత్రక సత్యాలు ఋజువు జేస్తున్నవి. ఆనాటి భారతీయ వ్యవస్థలో కులాలనేవి లేనేలేవు! ఆర్యుల దండయాత్రతో ఈ పరిస్థితి తారుమారైంది. ఈ ఆర్యులనబడే వారు మధ్య ఆసియా, మధ్య ఐరోపా ప్రాంతాల నుండి పొట్ట చేతబట్టుకొని భారతదేశానికి వలసలు బయల్దేరి వచ్చినట్లు చారిత్రక పరిశీలకులు భావిస్తున్నారు'. ఆర్యుల సంతతికి చెందిన కాశ్యపముని కాస్పియన్ సముద్రతీర ప్రాంతీయుడనీ, అదే విధంగ దూర్వాసుడు తురేనియన్ వంశీయుడనీ చారిత్రక పరిశోధకుల వాదన. అగస్త్యుడు అంటే వూరూ పేరూ లేనివాడని అర్ధం. ఆర్యుల పుట్టు పూర్వోత్తరాలపై సమగ్రమైన పరిశోధన జరిపిన మీదట వీరు నార్డిక్ తెగకు చెందినవారనీ; రైనునది, కాస్పియన్ సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తూండేవారని ప్రఖ్యాత చరిత్రకారుడైన హెచ్.జి. వెల్స్ పేర్కొన్నాడు. ఆర్యుల ఆచార వ్యవహారాలను గూర్చి హెచ్.జి.వెల్స్ ఇంకా ఇలా వ్రాశాడు". "ఆర్యులకు మాటకారి తనం జాస్తి, అర్ధనగ్నంగా తయారై తప్పత్రాగి పాటలు పాడుతూ, గంతులు వేయడమంటే వీరికి ఆసక్తి ఎక్కువ. ఆనాటి వీరి భాషకు లిపి అంటూ లేకపోవడం వల్లనే వీరి పూర్వ చరిత్రనంతా పాటల రూపంలోనే వ్యక్తం జేస్తుండేవారు.” ఆర్యుల దండయాత్రకు పూర్వం ద్రావిడులనబడే జాతులవారు ఉత్తర భారతంలో నివసిస్తూ ఉండేవారు. ఆసియా మైనర్ ప్రాంతానికి చెందిన త్రమీల్ జాతులవారే ఉత్తర భారతంలోని గంగా, సింధూ ప్రాంతాల్లో స్థిరపడి విశేష విజ్ఞాన సంపన్నులై గొప్ప పట్టణాలనే.................................© 2017,www.logili.com All Rights Reserved.