భారతదేశంలో సామాజిక శాస్త్ర అధ్యయనంలో అంబేడ్కర్ను మించినవారు లేరు. దానికి కారణం ఆయన అధ్యయనమే కాక ఆయన జీవితం కూడా. ఆయన ప్రతి క్షణం హిందూ వాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సమకాలీనంలో అన్ని తరగతుల వారికంటే ప్రతిభావంతుడై వుండి కూడా భారతదేశంలో ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చింది. కులం పునాదుల్ని త్రవ్వే ఈ పరిశోధనా పత్రాన్ని కొలంబియా యూనివర్సిటీలో చదవగలిగాడు గాని అప్పటికి భారతదేశంలో ఈ భావజాల పరిస్థితుల్ని వెలువరించే పరిస్థితులు లేవు. అప్పటికి స్వాతంత్య్రం ముమ్మరంగా నడుస్తుంది. జాతీయ నాయకులంతా హిందువులే. పైగా హిందూ సాంప్రదాయ వాదులు కూడా.
డా॥బి.ఆర్.అంబేడ్కర్ అమెరికాలో అనుభవించిన స్వేచ్ఛని, భారతదేశంలో అనుభవించిన అస్పృశ్యతని ఆయన జీవిత కోణం నుంచి చూసినప్పుడు సామాజిక శాస్త్రం ఆయనకు సాక్షాత్కరించింది. ఏ బ్రాహ్మణుడు కూడా కులం గురించి ఇంత బలంగా వ్రాయలేడు. కారణం అతనికి కులాధిపత్యం ఎదురు రాదు. బ్రాహ్మణుడు అనగానే ముందు గౌరవిస్తారు. అతను మేథావి అనుకుంటాడు. కానీ చదవందే ఎవ్వరూ మేథావులు కారని తెలియదు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చదువు ద్వారానే జ్ఞాన సంపన్నుడు అవుతాడు. అధ్యయనమే అతన్ని ఎల్లలు దాటిస్తుంది. చదువు వల్ల అతను నిరంతరం కొత్త మనిషి అవుతాడు. అందుకే అంబేడ్కర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ప్రధాన కారణం నిరంతర..................
అంబేడ్కర్ జీవిత చరిత్ర రెండవ భాగం సామాజిక శాస్త్రజ్ఞడు అంబేడ్కర్ భారతదేశంలో సామాజిక శాస్త్ర అధ్యయనంలో అంబేడ్కర్ను మించినవారు లేరు. దానికి కారణం ఆయన అధ్యయనమే కాక ఆయన జీవితం కూడా. ఆయన ప్రతి క్షణం హిందూ వాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సమకాలీనంలో అన్ని తరగతుల వారికంటే ప్రతిభావంతుడై వుండి కూడా భారతదేశంలో ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చింది. కులం పునాదుల్ని త్రవ్వే ఈ పరిశోధనా పత్రాన్ని కొలంబియా యూనివర్సిటీలో చదవగలిగాడు గాని అప్పటికి భారతదేశంలో ఈ భావజాల పరిస్థితుల్ని వెలువరించే పరిస్థితులు లేవు. అప్పటికి స్వాతంత్య్రం ముమ్మరంగా నడుస్తుంది. జాతీయ నాయకులంతా హిందువులే. పైగా హిందూ సాంప్రదాయ వాదులు కూడా. డా॥బి.ఆర్.అంబేడ్కర్ అమెరికాలో అనుభవించిన స్వేచ్ఛని, భారతదేశంలో అనుభవించిన అస్పృశ్యతని ఆయన జీవిత కోణం నుంచి చూసినప్పుడు సామాజిక శాస్త్రం ఆయనకు సాక్షాత్కరించింది. ఏ బ్రాహ్మణుడు కూడా కులం గురించి ఇంత బలంగా వ్రాయలేడు. కారణం అతనికి కులాధిపత్యం ఎదురు రాదు. బ్రాహ్మణుడు అనగానే ముందు గౌరవిస్తారు. అతను మేథావి అనుకుంటాడు. కానీ చదవందే ఎవ్వరూ మేథావులు కారని తెలియదు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చదువు ద్వారానే జ్ఞాన సంపన్నుడు అవుతాడు. అధ్యయనమే అతన్ని ఎల్లలు దాటిస్తుంది. చదువు వల్ల అతను నిరంతరం కొత్త మనిషి అవుతాడు. అందుకే అంబేడ్కర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ప్రధాన కారణం నిరంతర..................© 2017,www.logili.com All Rights Reserved.