చరిత్ర సృష్టించిన ప్రతి వ్యక్తిలో విశేషంగా కనిపించేది అతని వ్యక్తిత్వమే. ఆటుపోట్లు వచ్చినా చెదరక ముందుకు సాగిపోయే వారే ధిరచిత్తులు. వారి సిద్ధాంతాల అమలుకు జీవితాలు కూలిపోయినా అడుగుకూడా వెనక్కు నడవరు. బుద్ధుడు మొదలుకొని గాంథీ వరకు వారి వారి పోరాటాల్లో ఎదుర్కొన్న కష్టాలే ఎక్కువ. సిద్ధాంతమనేది సమాజానికి బ్రతికుండగా నచ్చని అంశం. అదేవారు చనిపోయాక విగ్రహాలు పెడతారు.
ప్రతి మనిషి పుట్టగానే నోట్లో బంగారు చెంచాతో పుట్టరు. కష్టాలు, కన్నీళ్ళు కలబోసుకుని, జీవితసారాన్ని బడబోసుకుని, వడిదుడుకుల ప్రవాహంలో ఎదురీది ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించే వాళ్ళే మహనీయులు. వాళ్ళ ఆశయాల బాటలో వ్యతిరేక శక్తులు కలిగించే అడ్డంకులెన్నో. అటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నివాసం ఏర్పరచుకున్న ధన్యజీవి డా. యన్టీరామారావు
- డా. నందమూరి లక్ష్మీపార్వతి