శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి పై విజయ్ త్రివేది రాసిన ఈ పుస్తకం ఒక నిశ్చలమైన జీవితగాథ. నిజానికి శ్రీ వాజ్ పేయి జీవితమే ఒక తెరచిన పుస్తకం, అందులోని ప్రతి పేజీ ఒక జీవిత పాఠం, ఒక గుణపాఠం నేర్పుతుంది. అంతకంటే ఎక్కువ అపరిగ్రహాన్ని, సాధుత్వ భావనను తలపిస్తుంది. బహుశా ఆ కారణం చేతనే ఏమో భాజపాని స్థాపించేటప్పుడు, దాని ఎన్నికల చిహ్నంగా కమలాన్ని ఏర్పరిచారు. శ్రీ వాజ్ పేయి జీవితం కమలం లాంటిదే, రాజకీయ పంకిలంలో ఉంటూ కూడా అది వికసిస్తూ, పరిమళిస్తూనే ఉంది, కానీ దాని మాలిన్యం మాత్రం ఎప్పుడూ దాన్ని తాకలేకపోయింది.
పుస్తకంలో శ్రీ వాజ్ పేయి మిత్రుల, సమకాలిక రాజకీయ నాయకుల జ్ఞాపకాలను సందర్భానుసారంగా పొందుపరచిన తీరు కేవలం శ్రీ వాజ్ పేయిని అర్థం చేసుకోవడానికి సహాయ పడడమే కాకుండా, తమని తాము ఉత్తమమైన మానవులుగా తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. శ్రీ వాజ్ పేయి నుంచి రాజకీయపు మెట్లు అధిరోహించే పాఠం నేర్చుకున్న లక్షలాది మంది రాజకీయ కార్యకర్తలు, వేలాది మంది రాజకీయ నాయకులు దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడ్ని కావడం నా అదృష్టం.
- రాజనాథ్ సింగ్
శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి పై విజయ్ త్రివేది రాసిన ఈ పుస్తకం ఒక నిశ్చలమైన జీవితగాథ. నిజానికి శ్రీ వాజ్ పేయి జీవితమే ఒక తెరచిన పుస్తకం, అందులోని ప్రతి పేజీ ఒక జీవిత పాఠం, ఒక గుణపాఠం నేర్పుతుంది. అంతకంటే ఎక్కువ అపరిగ్రహాన్ని, సాధుత్వ భావనను తలపిస్తుంది. బహుశా ఆ కారణం చేతనే ఏమో భాజపాని స్థాపించేటప్పుడు, దాని ఎన్నికల చిహ్నంగా కమలాన్ని ఏర్పరిచారు. శ్రీ వాజ్ పేయి జీవితం కమలం లాంటిదే, రాజకీయ పంకిలంలో ఉంటూ కూడా అది వికసిస్తూ, పరిమళిస్తూనే ఉంది, కానీ దాని మాలిన్యం మాత్రం ఎప్పుడూ దాన్ని తాకలేకపోయింది. పుస్తకంలో శ్రీ వాజ్ పేయి మిత్రుల, సమకాలిక రాజకీయ నాయకుల జ్ఞాపకాలను సందర్భానుసారంగా పొందుపరచిన తీరు కేవలం శ్రీ వాజ్ పేయిని అర్థం చేసుకోవడానికి సహాయ పడడమే కాకుండా, తమని తాము ఉత్తమమైన మానవులుగా తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. శ్రీ వాజ్ పేయి నుంచి రాజకీయపు మెట్లు అధిరోహించే పాఠం నేర్చుకున్న లక్షలాది మంది రాజకీయ కార్యకర్తలు, వేలాది మంది రాజకీయ నాయకులు దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడ్ని కావడం నా అదృష్టం. - రాజనాథ్ సింగ్© 2017,www.logili.com All Rights Reserved.