సాహిత్యం పట్ల శ్రద్ధ కలిగిన జవహర్ లాల్, తెలుగునాట గుంటూరు సీమలో జన్మించి వివిధ రంగాలలో సేవ చేసి సర్వత్రా గుర్తింపు పొందిన ప్రముఖుల జీవిత చిత్రాలను సేకరించి ఈ గ్రంథం సంకలనం చేసారు. ఇందులో 165 మంది ఆణిముత్యాల జీవిత చిత్రాలు, నిస్వార్ధ సేవలు, ఉన్నత ఆశయాలు ఉన్నాయి. ఈ పుస్తకం చదువుతుంటే ఆనాటి న్యాయకుల త్యాగాలు, ప్రజా శ్రేయస్సుకు సమాజ అభివృద్ధికి వారు పడిన పాట్లు వారి ఆలోచనా సరళి, నాటి జీవన విధానము మొదలైన అమూల్య సమాచారం పాఠకులకు లభిస్తుంది.
ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, వారిలో పోరాటస్పూర్తిని పెంచడానికి రచనలు చేసినవారు కొందరైతే, మరికొందరు నాటక, సినిమా రంగాల ద్వారా స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాటి పరిస్థితుల పై అవగాహన కలుగుతుంది. ప్రతిభామూర్తుల గురించి వీలైనంత సమాచారాన్ని సేకరించి భద్ర పరచుకోవల్సిన బాధ్యత మన అందరిది. ఇది ఈతరం వారికీ భావి తరాల వారికీ ఉపయోగపడే మంచి పుస్తకం.
- జవహర్ లాల్ గుత్తికొండ
సాహిత్యం పట్ల శ్రద్ధ కలిగిన జవహర్ లాల్, తెలుగునాట గుంటూరు సీమలో జన్మించి వివిధ రంగాలలో సేవ చేసి సర్వత్రా గుర్తింపు పొందిన ప్రముఖుల జీవిత చిత్రాలను సేకరించి ఈ గ్రంథం సంకలనం చేసారు. ఇందులో 165 మంది ఆణిముత్యాల జీవిత చిత్రాలు, నిస్వార్ధ సేవలు, ఉన్నత ఆశయాలు ఉన్నాయి. ఈ పుస్తకం చదువుతుంటే ఆనాటి న్యాయకుల త్యాగాలు, ప్రజా శ్రేయస్సుకు సమాజ అభివృద్ధికి వారు పడిన పాట్లు వారి ఆలోచనా సరళి, నాటి జీవన విధానము మొదలైన అమూల్య సమాచారం పాఠకులకు లభిస్తుంది. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, వారిలో పోరాటస్పూర్తిని పెంచడానికి రచనలు చేసినవారు కొందరైతే, మరికొందరు నాటక, సినిమా రంగాల ద్వారా స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాటి పరిస్థితుల పై అవగాహన కలుగుతుంది. ప్రతిభామూర్తుల గురించి వీలైనంత సమాచారాన్ని సేకరించి భద్ర పరచుకోవల్సిన బాధ్యత మన అందరిది. ఇది ఈతరం వారికీ భావి తరాల వారికీ ఉపయోగపడే మంచి పుస్తకం. - జవహర్ లాల్ గుత్తికొండ
© 2017,www.logili.com All Rights Reserved.