రాజకీయమంటే ప్రజా సంక్షేమమని నమ్మి తన జీవిత కాలమంతా అదే బాటలో నడిచిన ఆదర్శ రాజకీయ నాయకుడు. ఇటు రాష్ట్ర రాజకీయాలలోనూ, అటు జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రాజకీయ చతురుడు. గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి, రాజకీయ రంగంలో ప్రవేశించి రణకెక్కిన మహా నేత... ఆంద్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రి అయ్యారు.
కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. అఖిలభారత కాంగ్రేసు పార్టీ అధ్యక్షాపదవిని చేపట్టారు. కొద్దికాలం పాటు గవర్నర్ గా దేశానికి సేవలందించారు. మొదట ఒంగోలు బోర్డు చైర్మన్ గా రాజకీయ రంగంలో ప్రవేశించారు. తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిగా తన సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కొత్త పంతలు తొక్కించారు. పొలాల దప్పిక తీర్చటానికి నాగార్జున సాగర్, పోచంపాడు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆయనే కాసు బ్రహ్మానందరెడ్డి.
రాజకీయమంటే ప్రజా సంక్షేమమని నమ్మి తన జీవిత కాలమంతా అదే బాటలో నడిచిన ఆదర్శ రాజకీయ నాయకుడు. ఇటు రాష్ట్ర రాజకీయాలలోనూ, అటు జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రాజకీయ చతురుడు. గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి, రాజకీయ రంగంలో ప్రవేశించి రణకెక్కిన మహా నేత... ఆంద్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. అఖిలభారత కాంగ్రేసు పార్టీ అధ్యక్షాపదవిని చేపట్టారు. కొద్దికాలం పాటు గవర్నర్ గా దేశానికి సేవలందించారు. మొదట ఒంగోలు బోర్డు చైర్మన్ గా రాజకీయ రంగంలో ప్రవేశించారు. తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిగా తన సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కొత్త పంతలు తొక్కించారు. పొలాల దప్పిక తీర్చటానికి నాగార్జున సాగర్, పోచంపాడు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆయనే కాసు బ్రహ్మానందరెడ్డి.© 2017,www.logili.com All Rights Reserved.