మాకు నాలుగు కాళ్లు కాక రెండే కాళ్లు వుండటం వల్ల మాత్రమే మమ్మల్నిమనుషులు అనవలసి వస్తోంది. వాళ్ల పేరట్లో కట్టెసి వుంచే ఎద్దులకంటే హీనమైన పరిస్థితికి మమ్మల్ని దిగజార్చారు. కనీసం ఎద్దులకి ఎండుగడ్డయినా వేస్తారు. మాకు మాత్రం ఎంగిలి మెతుకులే గతి. అయితే తేడా ఏంటంటే ఎడ్లు కడుపునిండా తిని వాళ్ళ యజమానుల పెరటిలోనేవుంటాయి. మేము ఉండేది ఊరవతల పెంటకుప్పల్లో. అగ్రకులాలు ఆ పెంటకుప్పల మీదికి విసిరేసే చచ్చిన జంతువులకి మాత్రమే మేము యజమానులం. ఆ జంతువుల చర్మాలని ఒలిచే హక్కుని నిలబెట్టుకోడానికి మేము కుక్కలతోటి, పిల్లులతోటీ గేద్దలతోటి రాబందులతోటి కొట్ల్తాడాలి. ప్రపంచం నిలబడి ఉండటానికి కారణం మాత్రం మేమే. పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రం లాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పి వుంచే సముద్రల వంటి వారం మేము. అందుకే సముద్రానికి దక్కినట్టే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి. -బేబి కంబ్లే
© 2017,www.logili.com All Rights Reserved.