మా.గోఖలే భారతదేశ స్వాతంత్ర్యానికి ముప్పై ఏళ్ళకు ముందు జన్మించారు. తండ్రి గాంధీ గారి అడుగుజాడల్లో నిజాయతీగా నడచి జైలుకు వెళ్ళిన వ్యక్తి. పుట్టి పెరిగింది గ్రామీణ వాతావరణం. ఆ రోజుల్లో పల్లెల్లో వ్యవస్థ, తటస్థపడ్డ వ్యక్తులు, సంఘటనలు,ప్రభావితం చేసిన సత్యాలు. తండ్రి వ్యక్తిత్వం తనపై ప్రసరించినా స్వతంత్రమైన వ్యక్తిత్వం, కమ్యూనిస్ట్ భావాలూ, సూటిగా ప్రకటన ఎలా ఉంటుందో చూపించిన సాధన, శ్రమ, సృజనాత్మక కధలు, వ్యాస రచన, చిత్రలేఖనాల వైపు మళ్లింపు. 'కళాదర్శకత్వం'ను జీవనోపాధికి ఎన్నుకొని జీవితాంతం దానిలోనే నిమగ్నం. స్వచ్చమైన సృజనాత్మకత పంట ఇలా బాగా పండుతుంది. పదిమందికీ, సమాజానికీ ఉపయోగపడుతుంది. మహనీయులు మాధవపెద్ది గోఖలే గారి గురించి చెప్పుకోవాలంటే ఇవన్నీ మననం చేసుకోవాలి. అయన కధలు, వ్యాసాలలోని విశిష్టత చదువరులను ఆకర్షింపజేస్తుందని, ఆలోచింపజేస్తుందని, జీవితాలను దిద్దుకోవటానికి ఉపయోగపడుతుంది.
మా.గోఖలే భారతదేశ స్వాతంత్ర్యానికి ముప్పై ఏళ్ళకు ముందు జన్మించారు. తండ్రి గాంధీ గారి అడుగుజాడల్లో నిజాయతీగా నడచి జైలుకు వెళ్ళిన వ్యక్తి. పుట్టి పెరిగింది గ్రామీణ వాతావరణం. ఆ రోజుల్లో పల్లెల్లో వ్యవస్థ, తటస్థపడ్డ వ్యక్తులు, సంఘటనలు,ప్రభావితం చేసిన సత్యాలు. తండ్రి వ్యక్తిత్వం తనపై ప్రసరించినా స్వతంత్రమైన వ్యక్తిత్వం, కమ్యూనిస్ట్ భావాలూ, సూటిగా ప్రకటన ఎలా ఉంటుందో చూపించిన సాధన, శ్రమ, సృజనాత్మక కధలు, వ్యాస రచన, చిత్రలేఖనాల వైపు మళ్లింపు. 'కళాదర్శకత్వం'ను జీవనోపాధికి ఎన్నుకొని జీవితాంతం దానిలోనే నిమగ్నం. స్వచ్చమైన సృజనాత్మకత పంట ఇలా బాగా పండుతుంది. పదిమందికీ, సమాజానికీ ఉపయోగపడుతుంది. మహనీయులు మాధవపెద్ది గోఖలే గారి గురించి చెప్పుకోవాలంటే ఇవన్నీ మననం చేసుకోవాలి. అయన కధలు, వ్యాసాలలోని విశిష్టత చదువరులను ఆకర్షింపజేస్తుందని, ఆలోచింపజేస్తుందని, జీవితాలను దిద్దుకోవటానికి ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.