బెంగుళూరు నుంచి మైసూరువైపుగా వస్తున్న బస్ శ్రీరంగపట్నంలోకి పోయే రోడ్ కి ముందున్న ఆర్చ్ కేసి తిరిగింది. ఆర్చ్ దాటి లోపలకు పోతుంటే కుడివైపున పెద్ద గుట్టమీద చిన్న కోటబురుజు ఆనాటి వైభవానికి చిహ్నంగా మిగిలివుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఆ టూరిస్ట్ బస్ డ్రైవింగ్ సీట్ ప్రక్కనున్న సెకండ్ డ్రైవర్ కమ్ గైడ్ లోపలకు తొంగిచూసి టూరిస్టులను ఉద్దేశించి పెద్దగా చెప్పడం ప్రారంభించాడు.
“1785 ప్రాంతంలో ఒక వెలుగు వెలిగి బ్రిటీష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించిన వీరయోధుడు, మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పుసుల్తాన్ పరిపాలించిన శ్రీరంగపట్నం ఇప్పుడు శిథిలావస్థలో, ఆనాటి వైభవం కాల గర్భంలో కలిసిపోయి మృత పేటికగా మిగిలింది. ఆ ఒకప్పటి నగరం ఇప్పుడు, ప్రస్తుతం ఒక పట్టణంగా మారి మనకు దర్శనమిస్తోంది. అదిగో... అదే శ్రీరంగ పట్నానికి స్వాగతం చెబుతున్న స్వాగత తోరణం... ఒక్కమారు టిప్పుసుల్తాన్ ని మదిలో స్మరించుకుని ముందుకు సాగుదాం ....!”
బస్సు తిరిగి మెల్లగా ముందుకు కదిలింది. లోపల వున్న టూరిస్టులు కిటికీ అద్దాలలోంచి బయటకు, ఆనాటి ప్రాకారాలు, భవనాలు ఏమైనా కనిపిస్తాయేమోనని ఆశగా పరికిస్తున్నారు. కాని వారికి నిరాశే కానవస్తోంది.
దాదాపు రెండువందల ముప్పయ్ సంవత్సరాల నాటి గుర్తులను, ప్రాకారాలను, హర్మ్యాలను జాగ్రత్తగా కాపాడటానికి మనమేమైనా చరిత్రపట్ల మమకారం వున్నవాళ్ళమా...? చారిత్రక అవశేషాలను శాశ్వతంగా సమాధికట్టడంలో మనకంటే మించిన వారెవరు?
బ్రిటిష్ వారి సేనలు సృష్టించిన విధ్వంసాలు, ముస్లిమ్ దురహంకారులు చేసిన దహనకాండల అనంతరం మిగిలినవాటిని కూడా జాగ్రత్తగా చూసుకోలేని దౌర్భాగ్యులం! పెద్ద - పెద్ద కొండరాళ్ళను, కోటగోడలను పడగొట్టి వాటితో నిర్మాణాలు జరుపుకున్న వ్యక్తులం మనం!
గైడ్ కం సెకండ్ డ్రైవర్ మదిలో ఆలోచనలు కందిరీగల్లా తిరుగుతున్నాయి. ఉత్తరభారత దేశంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాచీన సంపదను, కోటలను, ఆనాటి అపురూప కట్టడాలను కొంతవరకయినా పదిలపరిచారు.
బెంగుళూరు నుంచి మైసూరువైపుగా వస్తున్న బస్ శ్రీరంగపట్నంలోకి పోయే రోడ్ కి ముందున్న ఆర్చ్ కేసి తిరిగింది. ఆర్చ్ దాటి లోపలకు పోతుంటే కుడివైపున పెద్ద గుట్టమీద చిన్న కోటబురుజు ఆనాటి వైభవానికి చిహ్నంగా మిగిలివుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఆ టూరిస్ట్ బస్ డ్రైవింగ్ సీట్ ప్రక్కనున్న సెకండ్ డ్రైవర్ కమ్ గైడ్ లోపలకు తొంగిచూసి టూరిస్టులను ఉద్దేశించి పెద్దగా చెప్పడం ప్రారంభించాడు. “1785 ప్రాంతంలో ఒక వెలుగు వెలిగి బ్రిటీష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించిన వీరయోధుడు, మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పుసుల్తాన్ పరిపాలించిన శ్రీరంగపట్నం ఇప్పుడు శిథిలావస్థలో, ఆనాటి వైభవం కాల గర్భంలో కలిసిపోయి మృత పేటికగా మిగిలింది. ఆ ఒకప్పటి నగరం ఇప్పుడు, ప్రస్తుతం ఒక పట్టణంగా మారి మనకు దర్శనమిస్తోంది. అదిగో... అదే శ్రీరంగ పట్నానికి స్వాగతం చెబుతున్న స్వాగత తోరణం... ఒక్కమారు టిప్పుసుల్తాన్ ని మదిలో స్మరించుకుని ముందుకు సాగుదాం ....!” బస్సు తిరిగి మెల్లగా ముందుకు కదిలింది. లోపల వున్న టూరిస్టులు కిటికీ అద్దాలలోంచి బయటకు, ఆనాటి ప్రాకారాలు, భవనాలు ఏమైనా కనిపిస్తాయేమోనని ఆశగా పరికిస్తున్నారు. కాని వారికి నిరాశే కానవస్తోంది. దాదాపు రెండువందల ముప్పయ్ సంవత్సరాల నాటి గుర్తులను, ప్రాకారాలను, హర్మ్యాలను జాగ్రత్తగా కాపాడటానికి మనమేమైనా చరిత్రపట్ల మమకారం వున్నవాళ్ళమా...? చారిత్రక అవశేషాలను శాశ్వతంగా సమాధికట్టడంలో మనకంటే మించిన వారెవరు? బ్రిటిష్ వారి సేనలు సృష్టించిన విధ్వంసాలు, ముస్లిమ్ దురహంకారులు చేసిన దహనకాండల అనంతరం మిగిలినవాటిని కూడా జాగ్రత్తగా చూసుకోలేని దౌర్భాగ్యులం! పెద్ద - పెద్ద కొండరాళ్ళను, కోటగోడలను పడగొట్టి వాటితో నిర్మాణాలు జరుపుకున్న వ్యక్తులం మనం! గైడ్ కం సెకండ్ డ్రైవర్ మదిలో ఆలోచనలు కందిరీగల్లా తిరుగుతున్నాయి. ఉత్తరభారత దేశంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాచీన సంపదను, కోటలను, ఆనాటి అపురూప కట్టడాలను కొంతవరకయినా పదిలపరిచారు.© 2017,www.logili.com All Rights Reserved.