తెలంగాణ మట్టిని కలంలో నింపుకున్న కథకుడు
కథ రాయడానికి ముడి సరుకు కావాలి, కానీ ఆ సరుకు కోసం ఎక్కడికి వెళ్లాలంటే చుట్టున్న జీవితాల్లోకి అని స్పష్టంగా తెలియజేసే కథలు ఇవి. నిజానికి ఇప్పుడిప్పుడే మనం ఓ ఏకాంత అంధకార గృహంలో నుండి బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చాము. ప్రకృతిపై దండెత్తిన మనిషికి, తిరిగి ప్రకృతి తనదైన స్టైల్లో తెలియజేయాలని మనిషి జీవితంలో కరోనా కంటే ముందు కరోనా తర్వాత అనే ఫేజ్ని తీసుకొచ్చింది.
ఈ ప్రకృతి-మనిషి-సమాజం అనే త్రికంలో ఇప్పుడు మానవ సంబంధాలను సరికొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి ప్రకృతిలో భాగమైనప్పుడు దాన్ని బాధ్యతగా కాపాడాల్సిన అవసరం కంటే, ఉన్న దాని చెడగొట్టకుండా ఉంటే చాలానే స్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితులను ముందు నుండే కథలుగా, మరీ ముఖ్యంగా తెలంగాణ పల్లె జీవనాడి పట్టుతో రాస్తున్న కథా రచయిత మ్యాకం రవి కుమార్.
తెలుగు-వెలుగు పోటీ కథలు చదివినప్పుడే నేను 'జిట్ట పులి' కథ చదివాను. అడవులను ఆక్రమిస్తూ పోతుంటే క్రూర మృగాలు మనుషుల దగ్గరికి రాక తప్పని పరిస్థితి. ఊరూరంతా రాత్రైతే చాలు ఎలాంటి భయంతో బతుకుతున్నారో అద్భుతంగా కథలో చిత్రిస్తూ చివరికి చెప్పాలనుకున్నా ప్రకృతి సందేశం కళ్ల ముందు ఉంచినట్టు అర్థమౌతుంది.
తెలంగాణ వచ్చి పదేండ్లు దాటిన నిరుద్యోగం మీద దృష్టి పెట్టాల్సినంతగా..................
తెలంగాణ మట్టిని కలంలో నింపుకున్న కథకుడు కథ రాయడానికి ముడి సరుకు కావాలి, కానీ ఆ సరుకు కోసం ఎక్కడికి వెళ్లాలంటే చుట్టున్న జీవితాల్లోకి అని స్పష్టంగా తెలియజేసే కథలు ఇవి. నిజానికి ఇప్పుడిప్పుడే మనం ఓ ఏకాంత అంధకార గృహంలో నుండి బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చాము. ప్రకృతిపై దండెత్తిన మనిషికి, తిరిగి ప్రకృతి తనదైన స్టైల్లో తెలియజేయాలని మనిషి జీవితంలో కరోనా కంటే ముందు కరోనా తర్వాత అనే ఫేజ్ని తీసుకొచ్చింది. ఈ ప్రకృతి-మనిషి-సమాజం అనే త్రికంలో ఇప్పుడు మానవ సంబంధాలను సరికొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి ప్రకృతిలో భాగమైనప్పుడు దాన్ని బాధ్యతగా కాపాడాల్సిన అవసరం కంటే, ఉన్న దాని చెడగొట్టకుండా ఉంటే చాలానే స్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితులను ముందు నుండే కథలుగా, మరీ ముఖ్యంగా తెలంగాణ పల్లె జీవనాడి పట్టుతో రాస్తున్న కథా రచయిత మ్యాకం రవి కుమార్. తెలుగు-వెలుగు పోటీ కథలు చదివినప్పుడే నేను 'జిట్ట పులి' కథ చదివాను. అడవులను ఆక్రమిస్తూ పోతుంటే క్రూర మృగాలు మనుషుల దగ్గరికి రాక తప్పని పరిస్థితి. ఊరూరంతా రాత్రైతే చాలు ఎలాంటి భయంతో బతుకుతున్నారో అద్భుతంగా కథలో చిత్రిస్తూ చివరికి చెప్పాలనుకున్నా ప్రకృతి సందేశం కళ్ల ముందు ఉంచినట్టు అర్థమౌతుంది. తెలంగాణ వచ్చి పదేండ్లు దాటిన నిరుద్యోగం మీద దృష్టి పెట్టాల్సినంతగా..................© 2017,www.logili.com All Rights Reserved.