సున్నితమైన హాస్యం, వ్యంగం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారాయణ్, తన తొలి ఆత్మకధాత్మక నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ (1935) తోనే గ్రాహం గ్రీన్ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ఈయనను తెలుగులో పట్టుకోవటమే ఒక సాహసం. పెద్దపులి ఆత్మకధ, మాటకారి చదువుతున్నంతసేపూ నారాయణ్ తెలుగులో రాస్తే ఇలాగే ఉంటుందనిపించేటంత సహజ సుందరంగా ఉంది శైలి. మాల్గుడిలోకి దక్షిణ భారత వాతావరణాన్ని చిత్రించటానికి మాండలికం సహాయం చేసిందనటంలో సందేహం లేదు.
- ముక్తవరం పార్ధసారధి
డా.ఎం.వి. రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వైద్య విద్యను అభ్యసించిన తర్వాత 'లా' చదివి కొంత కాలం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. కార్మిక నేతగా, క్రియాశీల రాజకీయవేత్తగా సుప్రసిద్ధులు. రచయితగా, సృజనశీలిగా విలువైన రచనలను తెలుగు పాఠకులకు అందించిన ఆయన రాయలసీమ వెనకబాటుతనాన్ని మొట్టమొదటగా గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. పరిష్కారం కధల సంపుటి, రాయలసీమ కన్నీటి గాధ, తెలుగు సినిమా - స్వర్ణయుగం వీరి రచనలు. పాపియాన్ కు వీరి తెలుగు అనువాదం రెక్కలు చూచిన పంజరం, పురోగమనం పేరెన్నికగన్నవి.
సున్నితమైన హాస్యం, వ్యంగం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారాయణ్, తన తొలి ఆత్మకధాత్మక నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ (1935) తోనే గ్రాహం గ్రీన్ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ఈయనను తెలుగులో పట్టుకోవటమే ఒక సాహసం. పెద్దపులి ఆత్మకధ, మాటకారి చదువుతున్నంతసేపూ నారాయణ్ తెలుగులో రాస్తే ఇలాగే ఉంటుందనిపించేటంత సహజ సుందరంగా ఉంది శైలి. మాల్గుడిలోకి దక్షిణ భారత వాతావరణాన్ని చిత్రించటానికి మాండలికం సహాయం చేసిందనటంలో సందేహం లేదు. - ముక్తవరం పార్ధసారధి డా.ఎం.వి. రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వైద్య విద్యను అభ్యసించిన తర్వాత 'లా' చదివి కొంత కాలం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. కార్మిక నేతగా, క్రియాశీల రాజకీయవేత్తగా సుప్రసిద్ధులు. రచయితగా, సృజనశీలిగా విలువైన రచనలను తెలుగు పాఠకులకు అందించిన ఆయన రాయలసీమ వెనకబాటుతనాన్ని మొట్టమొదటగా గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. పరిష్కారం కధల సంపుటి, రాయలసీమ కన్నీటి గాధ, తెలుగు సినిమా - స్వర్ణయుగం వీరి రచనలు. పాపియాన్ కు వీరి తెలుగు అనువాదం రెక్కలు చూచిన పంజరం, పురోగమనం పేరెన్నికగన్నవి.© 2017,www.logili.com All Rights Reserved.