మొద్దబ్బాయిగా ముద్రపడిన బాలుడు ఎందరి జీవితాలపైననో చెరగని ముద్రలు వేస్తాడు. కృషివుంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపిస్తాడు. గృహతాపసిగ ఓ వెలుగు వెలుగుతాడు. దేవునిగా కొలువబడతాడు.
ఇది ఓ ఏడెనిమిది తరాలనాటి కథ.. తరతరాలుగా నిలిచిపోయే ధర్మవీరము - పలనాటి పోతుగడ్డపై చిరుమామిళ్ళ సుబ్బదాసు శాంతిమయ జీవితచరితము.
మా గ్రామం తుళ్లూరులో పలనాటి వీరుల గుడి ఉంది. పలనాటి విరగాథలు పంబజోడు మోతల మధ్య చిన్ననాటనే విన్నవాణ్ణి. ఆ చారిత్రక ఘట్టాలను ఒక్కొక్కటీ కళ్లప్పగించి చూచినవాణ్ణి. పలనాటి ప్రాంతపు కొంగరవారబ్బాయితో ఎంతో చనువుగా మెలిగిన వాళ్ల ప్రాంతం వెళ్లి చూచివద్దామని ఎందుకు అనలేదో తెలియనే తెలియదు.
- రావెల సాంబశివరావు
కొందరి జీవితాలు అంతే....
సాధారణ జీవితాలు అసాధారణ మలుపులు తిరుగుతాయి.