డా|| ఏ.ఎస్. రామన్ (09.04.1919 - 24.06.2001) గా ప్రసిద్ధులైన అవధానం సీతారాముడు తల్లిదండ్రులు రుక్మిణమ్మ, కృష్ణముని. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో బి.ఏ. (ఆనర్స్) పట్టా సాధించారు. ఐ.సి.ఎస్. (నేటి ఐ.పి.ఎస్.)లో 17వ ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం రాలేదు. అప్పుడు పత్రికారంగంలో ప్రవేశించారు. 1936 నుండే రామన్ కథలు, వ్యాసాలు, పద్యాలు ఆనాటి ప్రసిద్ధ పత్రికలలో ప్రచురితం అవుతుండేవి. 1943లో 'అవర్ ఇండియా' పత్రికను తానే సంపాదకుడిగా స్థాపించారు. మార్గ్, స్టేట్స్మ న్, టైమ్స్ ఆఫ్ ఇండియా, లండన్ స్టుడియో మ్యాగయిన్ వంటి ప్రసిద్ధ పత్రికలకు కళలపై అనేక వ్యాసాలు రాశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే ప్రతిష్టాత్మక పత్రికకు 1953లో ప్రధాన సంపాదకులై పాశ్చాత్యులను, భారతీయులను ఆకర్షించగల పత్రికగా తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, సాహిత్యం , కళలు, రాజకీయాల గురించి సమగ్రమైన అవగాహన కలిగించే పత్రికగా మార్చారు. కూచిపూడి నాట్యం అంతర్జాతీయ ఖ్యాతి గాంచడంలో రామన్న పాత్ర ఉంది. పై పత్రికకోసం రామన్ అనేకమంది ప్రసిద్దులతో ముఖాముఖి జరిపారు. వాటిలో ఒకటి “A Rare Interview of Viswanatha Satyanarayana."
శ్రీ రావెల సాంబశివరావు (15.07.1941) జనకతల్లిదండ్రులు గుజ్జర్లపూడి కోటేశ్వరరావు, వెంకటాచలమ్మ. దత్తుతల్లిదండ్రులు రావెల తిరుపతయ్య, తులశమ్మ. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఎం.ఏ. (సోషల్ వర్క్ చదివారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పదవీ విరమణ చేశారు. కవిరాజుకథ, కవిరాజు విజయము, బింబాలు - ప్రతిబింబాలు, జాతివెలుగులు, సిలకమ్మ పాటలు, గోరుముద్దలు, ఉద్యోగిపర్వము, పల్నాటి పోతన స్వతంత్ర గ్రంథాలు. ఎన్నో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. రాయ, ఆచార్య రంగ స్వీయకథ, శారదా బెయిల్, మధు దండావతే, రామ్ మనోహర్ లోహియా ఆదరణ పొందిన అనువాదాలు. నిరంతర సాహిత్యాధ్యయనం చేసే శ్రద్ధాళువు.
డా|| ఏ.ఎస్. రామన్ (09.04.1919 - 24.06.2001) గా ప్రసిద్ధులైన అవధానం సీతారాముడు తల్లిదండ్రులు రుక్మిణమ్మ, కృష్ణముని. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో బి.ఏ. (ఆనర్స్) పట్టా సాధించారు. ఐ.సి.ఎస్. (నేటి ఐ.పి.ఎస్.)లో 17వ ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం రాలేదు. అప్పుడు పత్రికారంగంలో ప్రవేశించారు. 1936 నుండే రామన్ కథలు, వ్యాసాలు, పద్యాలు ఆనాటి ప్రసిద్ధ పత్రికలలో ప్రచురితం అవుతుండేవి. 1943లో 'అవర్ ఇండియా' పత్రికను తానే సంపాదకుడిగా స్థాపించారు. మార్గ్, స్టేట్స్మ న్, టైమ్స్ ఆఫ్ ఇండియా, లండన్ స్టుడియో మ్యాగయిన్ వంటి ప్రసిద్ధ పత్రికలకు కళలపై అనేక వ్యాసాలు రాశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే ప్రతిష్టాత్మక పత్రికకు 1953లో ప్రధాన సంపాదకులై పాశ్చాత్యులను, భారతీయులను ఆకర్షించగల పత్రికగా తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, సాహిత్యం , కళలు, రాజకీయాల గురించి సమగ్రమైన అవగాహన కలిగించే పత్రికగా మార్చారు. కూచిపూడి నాట్యం అంతర్జాతీయ ఖ్యాతి గాంచడంలో రామన్న పాత్ర ఉంది. పై పత్రికకోసం రామన్ అనేకమంది ప్రసిద్దులతో ముఖాముఖి జరిపారు. వాటిలో ఒకటి “A Rare Interview of Viswanatha Satyanarayana." శ్రీ రావెల సాంబశివరావు (15.07.1941) జనకతల్లిదండ్రులు గుజ్జర్లపూడి కోటేశ్వరరావు, వెంకటాచలమ్మ. దత్తుతల్లిదండ్రులు రావెల తిరుపతయ్య, తులశమ్మ. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఎం.ఏ. (సోషల్ వర్క్ చదివారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పదవీ విరమణ చేశారు. కవిరాజుకథ, కవిరాజు విజయము, బింబాలు - ప్రతిబింబాలు, జాతివెలుగులు, సిలకమ్మ పాటలు, గోరుముద్దలు, ఉద్యోగిపర్వము, పల్నాటి పోతన స్వతంత్ర గ్రంథాలు. ఎన్నో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. రాయ, ఆచార్య రంగ స్వీయకథ, శారదా బెయిల్, మధు దండావతే, రామ్ మనోహర్ లోహియా ఆదరణ పొందిన అనువాదాలు. నిరంతర సాహిత్యాధ్యయనం చేసే శ్రద్ధాళువు.© 2017,www.logili.com All Rights Reserved.