లోహియా ఆలోచనా స్రవంతిలో
విమర్శనాత్మక దృక్కోణం
“జీవితంలోని విలువలన్నీ తారుమారైపోయాయి. ఉన్నత కులాలవారు సంస్కారం ఉన్న కుతంత్రపరులుగాను, బడుగు కులాలవారేమో మార్పు ఎరుగని జీవచ్ఛవాలుగానూ బతుకులీడుస్తున్నారు. దేశంలో మేధావుల్ని గుర్తించడానికి కొలబద్దగా విజ్ఞాన సంపాదనను గుర్తించడానికి బదులు మాటల్లోని సొంపులు, సొగసులు మాత్రమే కొలబద్దలుగా తీసుకోవడం జరుగుతోంది. నిర్మొహమాటం, నిర్భయం అనే సుగుణాలకన్నా చాకచక్యం, పైకి విధేయత, చాటుమాటు వ్యవహారాలు ఔన్నత్యానికి చిహ్నాలుగా తయారయ్యాయి. రాజకీయ జీవితంలో బొంకులకు గొప్ప గౌరవస్థానం లభించింది. సంకుచిత తత్వం, స్వార్థం, బొంకు- ఈ దారుణాలను గొప్పదనంగాను, మార్పును అడ్డుకునే 'గొప్ప' శక్తిగాను కులవ్యవస్థ తయారైంది. భారత పౌరులు తమ స్వదేశంలోనే పరాయివారుగా 'చూపబడుతున్నారు. వారి భాషలూ అణచివేతకు గురైనాయి”.
ఇంతకూ మానవ మేధస్సును పదునెక్కించి, ఉడికించే ఈ మాటలన్నది ఎవరో కాదు, కారలమ్మా ను ప్రేమించే భారత సోషలిస్టు అగ్రనాయకులలో ఒకరైన రామమనోహర్ లోహియా. 1949 నుంచి 1963 దాకా ఆయన వివిధ సందర్భాలలో భారతదేశంలోని పలుప్రాంతాల పర్యటనల సందర్భంగా అనేక జాతీయ, అంతర్జాతీయ విషయాలపైన విమర్శనాత్మక, విశ్లేషణాత్మక దృక్కోణం నుంచి చేసిన ప్రసంగాలకు రావెల సాంబశివరావు చేసిన తెలుగు అనువాదం ఇది. లోహియా విశిష్ట ఆంగ్ల రచనలను అనువదించడంలో అనువాదకులు రావెల సాంబశివరావు చాలా వరకు న్యాయం చేయగలిగారు.
లోహియా మౌలిక శిష్ట భాషాప్రసంగాలకు అనువాదకులు "విశ్వమానవ రాగం - లోహియా మానసగానం" అని నామకరణం చేశారు. ఈ గ్రంథంలోని వ్యాసాలు ప్రధానంగా “మార్క్-గాంధీ అండ్ సోషలిజం" అనే గ్రంథం లోనివే అయినా “విల్ టు పవర్" అనే మరో విశిష్ట సంపుటి (1956)లోని పెక్కు ప్రాపంచిక విషయాలపై సోషలిస్టు సిద్ధాంత ఆలోచనా పునాది పూర్వరంగం నుంచి చేసిన విశిష్టమైన స్వతంత్ర పరిశీలనలు,..........
లోహియా ఆలోచనా స్రవంతిలో విమర్శనాత్మక దృక్కోణం “జీవితంలోని విలువలన్నీ తారుమారైపోయాయి. ఉన్నత కులాలవారు సంస్కారం ఉన్న కుతంత్రపరులుగాను, బడుగు కులాలవారేమో మార్పు ఎరుగని జీవచ్ఛవాలుగానూ బతుకులీడుస్తున్నారు. దేశంలో మేధావుల్ని గుర్తించడానికి కొలబద్దగా విజ్ఞాన సంపాదనను గుర్తించడానికి బదులు మాటల్లోని సొంపులు, సొగసులు మాత్రమే కొలబద్దలుగా తీసుకోవడం జరుగుతోంది. నిర్మొహమాటం, నిర్భయం అనే సుగుణాలకన్నా చాకచక్యం, పైకి విధేయత, చాటుమాటు వ్యవహారాలు ఔన్నత్యానికి చిహ్నాలుగా తయారయ్యాయి. రాజకీయ జీవితంలో బొంకులకు గొప్ప గౌరవస్థానం లభించింది. సంకుచిత తత్వం, స్వార్థం, బొంకు- ఈ దారుణాలను గొప్పదనంగాను, మార్పును అడ్డుకునే 'గొప్ప' శక్తిగాను కులవ్యవస్థ తయారైంది. భారత పౌరులు తమ స్వదేశంలోనే పరాయివారుగా 'చూపబడుతున్నారు. వారి భాషలూ అణచివేతకు గురైనాయి”. ఇంతకూ మానవ మేధస్సును పదునెక్కించి, ఉడికించే ఈ మాటలన్నది ఎవరో కాదు, కారలమ్మా ను ప్రేమించే భారత సోషలిస్టు అగ్రనాయకులలో ఒకరైన రామమనోహర్ లోహియా. 1949 నుంచి 1963 దాకా ఆయన వివిధ సందర్భాలలో భారతదేశంలోని పలుప్రాంతాల పర్యటనల సందర్భంగా అనేక జాతీయ, అంతర్జాతీయ విషయాలపైన విమర్శనాత్మక, విశ్లేషణాత్మక దృక్కోణం నుంచి చేసిన ప్రసంగాలకు రావెల సాంబశివరావు చేసిన తెలుగు అనువాదం ఇది. లోహియా విశిష్ట ఆంగ్ల రచనలను అనువదించడంలో అనువాదకులు రావెల సాంబశివరావు చాలా వరకు న్యాయం చేయగలిగారు. లోహియా మౌలిక శిష్ట భాషాప్రసంగాలకు అనువాదకులు "విశ్వమానవ రాగం - లోహియా మానసగానం" అని నామకరణం చేశారు. ఈ గ్రంథంలోని వ్యాసాలు ప్రధానంగా “మార్క్-గాంధీ అండ్ సోషలిజం" అనే గ్రంథం లోనివే అయినా “విల్ టు పవర్" అనే మరో విశిష్ట సంపుటి (1956)లోని పెక్కు ప్రాపంచిక విషయాలపై సోషలిస్టు సిద్ధాంత ఆలోచనా పునాది పూర్వరంగం నుంచి చేసిన విశిష్టమైన స్వతంత్ర పరిశీలనలు,..........© 2017,www.logili.com All Rights Reserved.