చరిత్ర ప్రసిద్ధి గాంచిన వీరవనితలలో ఒరుగంటిని పాలించిన రాణి రుద్రమదేవికి, ప్రధమ భారత స్వాతంత్ర్య సమరాన్ని నడిపిన ఝాన్సీ రాణికి ప్రత్యేక స్థానం ఉంది. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమను కొడుకులా పెంచి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తురాలిని చేశారు. సకల విద్యాపారంగాతురాలైన రుద్రమదేవి తన ధైర్యసాహసాలతో, శౌర్య పరాక్రమాలతో పురుషులకు ఏ మాత్రమూ తీసిపోని రీతిలో పరిపాలన సాగించి అందరి మెప్పులను పొందింది.
"రాణి రుద్రమదేవి" కథ ద్వారా బాలలు ఆనాటి దేశకాల పరిస్థితులను, సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెలుసుకుంటారని, అంతకంటే ముఖ్యంగా సాహసోపేతమైన ఆమె జీవితాన్నుండి స్ఫూర్తి పొందుతారనే విశ్వాసంతో ఈ రచనను చేశాను. ఈ కథ చదివాక 'తాము అబలలంకాదు - ధైర్యసాహసాలతో, పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది లేదు' అనే ఆత్మావిశ్వాసం ఆడపిల్లల్లోను, 'స్త్రీ' పురుషుడికి ఏ మాత్రం తీసిపోదు - 'ఆమెను న్యూనతా భావంతో చూడడం తగదు' అనే భావన మగపిల్లల హృదయాలలోనూ ఇసుమంతైనా కలిగితే ఈ రచన సార్థకమైనట్లే భావిస్తాను.
చరిత్ర ప్రసిద్ధి గాంచిన వీరవనితలలో ఒరుగంటిని పాలించిన రాణి రుద్రమదేవికి, ప్రధమ భారత స్వాతంత్ర్య సమరాన్ని నడిపిన ఝాన్సీ రాణికి ప్రత్యేక స్థానం ఉంది. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమను కొడుకులా పెంచి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తురాలిని చేశారు. సకల విద్యాపారంగాతురాలైన రుద్రమదేవి తన ధైర్యసాహసాలతో, శౌర్య పరాక్రమాలతో పురుషులకు ఏ మాత్రమూ తీసిపోని రీతిలో పరిపాలన సాగించి అందరి మెప్పులను పొందింది. "రాణి రుద్రమదేవి" కథ ద్వారా బాలలు ఆనాటి దేశకాల పరిస్థితులను, సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెలుసుకుంటారని, అంతకంటే ముఖ్యంగా సాహసోపేతమైన ఆమె జీవితాన్నుండి స్ఫూర్తి పొందుతారనే విశ్వాసంతో ఈ రచనను చేశాను. ఈ కథ చదివాక 'తాము అబలలంకాదు - ధైర్యసాహసాలతో, పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది లేదు' అనే ఆత్మావిశ్వాసం ఆడపిల్లల్లోను, 'స్త్రీ' పురుషుడికి ఏ మాత్రం తీసిపోదు - 'ఆమెను న్యూనతా భావంతో చూడడం తగదు' అనే భావన మగపిల్లల హృదయాలలోనూ ఇసుమంతైనా కలిగితే ఈ రచన సార్థకమైనట్లే భావిస్తాను.© 2017,www.logili.com All Rights Reserved.