ఆంతరంగిక ప్రపంచమూ, బయటి ప్రపంచమూ అంటూ రెండు ప్రపంచాలున్నాయని తెలిసినప్పుడు, ఆరెండింలో ఏది నిజమన్న ప్రశ్న ఎదురవుతుంది. బహుశా ఆ రెండూ మరో పెద్ద ప్రపంచపు భాగాలే కావచ్చు. అంతరంగిక, బయటి ప్రపంచాలు రెండింటినీ ప్రతిభావంతంగా చిత్రించిన చాలా కొద్దిమంది తెలుగు కథకుల్లో ఆర్ వసుంధరాదేవి ప్రముఖులు. వసుంధరాదేవి కథల్లోని పాత్రలు మనకు తెలిసిన ప్రపంచంలోని సాదాసీదా మనుషులే!
ఒక మామూలు సన్నివేశంలోంచి అసాధారణమైన సత్యాన్ని ఆవిష్కరించే ఆమె కథలన్నింటినీ చదివినప్పుడు రచయిత్రికున్న 'ఎరుక' ఎటువంటిదో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకునే క్రమంలో ఆ 'ఎరుక' పాఠకుడిలోనూ వెలుగుల్ని విరజిమ్మి, అతడిలోని మాలిన్యాన్ని శుభ్రపరుస్తుంది.
అనవసరపు దుఃఖంలో మునగడం అనారోగ్యపు మనసు చేసే పని. దుఃఖపది సాధించేదేమీ లేదన్న సంగతి వసుంధరాదేవికి తెలుసు. మరణం గురించి ఆమెలా ఇంత సాలోచనగా చర్చించిన కథకులు మరొకరు లేరు. ఆమె కథలన్నీ జీవితాన్ని ప్రేమించడం నేర్పినవే! ఆమె కథలన్నీ వ్యక్తిలో జీవితేచ్చను పెంచడంలో విజయం సాధించినవే! తెలుగు నేలకు సుపరిచితురాలైన ఆమె కథలు చాలా వాటిలో రాయలసీమ మట్టివాసన గుభాళిస్తుంది.
ఆంతరంగిక ప్రపంచమూ, బయటి ప్రపంచమూ అంటూ రెండు ప్రపంచాలున్నాయని తెలిసినప్పుడు, ఆరెండింలో ఏది నిజమన్న ప్రశ్న ఎదురవుతుంది. బహుశా ఆ రెండూ మరో పెద్ద ప్రపంచపు భాగాలే కావచ్చు. అంతరంగిక, బయటి ప్రపంచాలు రెండింటినీ ప్రతిభావంతంగా చిత్రించిన చాలా కొద్దిమంది తెలుగు కథకుల్లో ఆర్ వసుంధరాదేవి ప్రముఖులు. వసుంధరాదేవి కథల్లోని పాత్రలు మనకు తెలిసిన ప్రపంచంలోని సాదాసీదా మనుషులే! ఒక మామూలు సన్నివేశంలోంచి అసాధారణమైన సత్యాన్ని ఆవిష్కరించే ఆమె కథలన్నింటినీ చదివినప్పుడు రచయిత్రికున్న 'ఎరుక' ఎటువంటిదో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకునే క్రమంలో ఆ 'ఎరుక' పాఠకుడిలోనూ వెలుగుల్ని విరజిమ్మి, అతడిలోని మాలిన్యాన్ని శుభ్రపరుస్తుంది. అనవసరపు దుఃఖంలో మునగడం అనారోగ్యపు మనసు చేసే పని. దుఃఖపది సాధించేదేమీ లేదన్న సంగతి వసుంధరాదేవికి తెలుసు. మరణం గురించి ఆమెలా ఇంత సాలోచనగా చర్చించిన కథకులు మరొకరు లేరు. ఆమె కథలన్నీ జీవితాన్ని ప్రేమించడం నేర్పినవే! ఆమె కథలన్నీ వ్యక్తిలో జీవితేచ్చను పెంచడంలో విజయం సాధించినవే! తెలుగు నేలకు సుపరిచితురాలైన ఆమె కథలు చాలా వాటిలో రాయలసీమ మట్టివాసన గుభాళిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.