భరతజాతి ముద్దు బిడ్డ శ్రీనివాస రామానుజన్. సంఖ్యాలోక సామ్రాట్ అతడు. స్వయం శిక్షణతో గణిత శాస్త్రాన్ని ఔపోసన పట్టిన దిట్ట అతడు. సంస్థాగతమైన అండగానీ, గురువుల శిక్షణగానీ తగినంతగా లేకుండానే స్వీయ ప్రేరణతో, స్వయం కృషితో మహా మేధావుల స్థాయిని అవలీలగా అందుకున్న తపస్వి అతడు. తన అసమాన ప్రతిభతో ప్రపంచ గణితజ్ఞుల్ని ముగ్ధుల్ని చేసిన మాంత్రికుడు అతడు.
ఆయన ప్రజ్ఞను గ్రహించిన బ్రిటిషు శాస్త్రవేత్తలు కొందరు పట్టుబట్టి ఆయనను తమ దగ్గరకు రప్పించుకున్న తీరు చిరస్మరణీయం. అదే సమయంలో సంస్కృతీపరమైన అగాధాల వల్ల రామానుజన్ ఇంగ్లండులో పడిన ఇబ్బందులు హృదయ విదారకం. ఆ మహా మేధావి జీవితం గురించీ ఆయన కృషిని గురించీ విద్యార్థులకు సరళంగా తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి అందిస్తున్న పుస్తకం ఇది.
భరతజాతి ముద్దు బిడ్డ శ్రీనివాస రామానుజన్. సంఖ్యాలోక సామ్రాట్ అతడు. స్వయం శిక్షణతో గణిత శాస్త్రాన్ని ఔపోసన పట్టిన దిట్ట అతడు. సంస్థాగతమైన అండగానీ, గురువుల శిక్షణగానీ తగినంతగా లేకుండానే స్వీయ ప్రేరణతో, స్వయం కృషితో మహా మేధావుల స్థాయిని అవలీలగా అందుకున్న తపస్వి అతడు. తన అసమాన ప్రతిభతో ప్రపంచ గణితజ్ఞుల్ని ముగ్ధుల్ని చేసిన మాంత్రికుడు అతడు. ఆయన ప్రజ్ఞను గ్రహించిన బ్రిటిషు శాస్త్రవేత్తలు కొందరు పట్టుబట్టి ఆయనను తమ దగ్గరకు రప్పించుకున్న తీరు చిరస్మరణీయం. అదే సమయంలో సంస్కృతీపరమైన అగాధాల వల్ల రామానుజన్ ఇంగ్లండులో పడిన ఇబ్బందులు హృదయ విదారకం. ఆ మహా మేధావి జీవితం గురించీ ఆయన కృషిని గురించీ విద్యార్థులకు సరళంగా తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి అందిస్తున్న పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.