కొత్తగూడెం, పూనా, విజయవాడ లాంటి ప్రదేశాల నుంచి కూడా స్నేహితులు, సాహితీమిత్రులు వచ్చి 'శిఖరారోహణం' ఆవిష్కరణ ఉత్సవంలో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. వారి వారి ప్రసంగాలు అయిన తర్వాత స్పందనగా నన్నో పదిహేను, ఇరవై నిముషాలు మాట్లాడమన్నారు. అనుకోకుండా జీవితమంతా ఒక్కసారి ఒక్కసారి కళ్ళ ముందు నిలబడినట్టు అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలు, సినిమా అనుభవాలు, ఉద్యమ - వైవాహిక జీవితం, పళనియప్పన్ తో భేటి, ఉద్యోగం, పిల్లలు, కుటుంబాలు అన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాను. తర్వాత చెబితే కానీ నలభై అయిదు నిముషాలు మాట్లాడానని తెలియలేదు. అంతా అన్నారు - మీరు ఈ జ్ఞాపకాలను రాయడం అవసరం అని. ఎప్పట్నించో ఈ విషయం నలుగుతోంది. గత ఏడాదిగా వ్రాశాను. వ్రాస్తూ వెళ్లాను. వెరసి ఈ పుస్తకం.. ఇప్పుడు మీ చేతుల్లో..
కొత్తగూడెం, పూనా, విజయవాడ లాంటి ప్రదేశాల నుంచి కూడా స్నేహితులు, సాహితీమిత్రులు వచ్చి 'శిఖరారోహణం' ఆవిష్కరణ ఉత్సవంలో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. వారి వారి ప్రసంగాలు అయిన తర్వాత స్పందనగా నన్నో పదిహేను, ఇరవై నిముషాలు మాట్లాడమన్నారు. అనుకోకుండా జీవితమంతా ఒక్కసారి ఒక్కసారి కళ్ళ ముందు నిలబడినట్టు అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలు, సినిమా అనుభవాలు, ఉద్యమ - వైవాహిక జీవితం, పళనియప్పన్ తో భేటి, ఉద్యోగం, పిల్లలు, కుటుంబాలు అన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాను. తర్వాత చెబితే కానీ నలభై అయిదు నిముషాలు మాట్లాడానని తెలియలేదు. అంతా అన్నారు - మీరు ఈ జ్ఞాపకాలను రాయడం అవసరం అని. ఎప్పట్నించో ఈ విషయం నలుగుతోంది. గత ఏడాదిగా వ్రాశాను. వ్రాస్తూ వెళ్లాను. వెరసి ఈ పుస్తకం.. ఇప్పుడు మీ చేతుల్లో..© 2017,www.logili.com All Rights Reserved.