యాత్ర అంటే ఏమిటి? ప్రాంతాలను మాత్రమే సందర్శిస్తే అది సంపూర్ణ యాత్ర అవుతుందా? ప్రాంతాలతో పాటు అక్కడి మనుషులను చూసి, కలిసి, వారి కథలను విని వారితో ముచ్చటిస్తే ఆ యాత్ర సంపూర్ణంగా సార్ధకమౌతుంది. దీనినే ఇంగ్లీష్ లో "Maps and chaps" లేదా "Places and people" అంటారు. నాకు తెలిసిన మేరకు యాత్రా సాహిత్యాన్ని రచించిన వి ఎస్ నైపాల్, విలియం డార్లింపుల్, విక్రం సేట్ లు ప్రాంతాలు, ప్రజలు, చరిత్ర, రాజకీయ, సంఘీక పరిస్థితులను పరిశీలిస్తూ ఈ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహించారు. తెలుగులో వస్తున్న యాత్రా సాహిత్యం ఆ స్థాయిని అందుకోవాలని నా అభిలాష.
యాత్ర అంటే ఏమిటి? ప్రాంతాలను మాత్రమే సందర్శిస్తే అది సంపూర్ణ యాత్ర అవుతుందా? ప్రాంతాలతో పాటు అక్కడి మనుషులను చూసి, కలిసి, వారి కథలను విని వారితో ముచ్చటిస్తే ఆ యాత్ర సంపూర్ణంగా సార్ధకమౌతుంది. దీనినే ఇంగ్లీష్ లో "Maps and chaps" లేదా "Places and people" అంటారు. నాకు తెలిసిన మేరకు యాత్రా సాహిత్యాన్ని రచించిన వి ఎస్ నైపాల్, విలియం డార్లింపుల్, విక్రం సేట్ లు ప్రాంతాలు, ప్రజలు, చరిత్ర, రాజకీయ, సంఘీక పరిస్థితులను పరిశీలిస్తూ ఈ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహించారు. తెలుగులో వస్తున్న యాత్రా సాహిత్యం ఆ స్థాయిని అందుకోవాలని నా అభిలాష.© 2017,www.logili.com All Rights Reserved.