Vidhi Na Saradhi

Rs.175
Rs.175

Vidhi Na Saradhi
INR
EMESCO0094
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ఎనభై సంవత్సరాలు దాటిన వయస్సులో ఒక తెలుగు జర్నలిస్టు వెనుదిరిగి చూసుకొన్నప్పుడు స్మృతిపథంలో మొదలైన జీవితానుభవాల మాలిక ఈ స్వీయ చరిత్ర. ఒక చిన్న పత్రికలో ఒక చిన్న ఉద్యోగంతో మొదలై, పెద్ద పత్రికలో సంపాదకత్వం వరకు సాగిన మూడున్నర దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానం. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పాత పత్రికల డిజిటైజేషన్. తెలంగాణ ప్రజల అస్మితను, ఆకాంక్షను, రాష్ట్ర విభజన అనివార్యతను గుర్తించి 1969 నుంచి 2014లో రెండు రాష్ట్రాలు ఏర్పడేవరకూ రచయిత చేసిన యథాశక్తి కృషి, రెండు రాష్ట్రాల ఏర్పాటు ఉభయ ప్రాంతాలకు శ్రేయస్కరమని విశ్వసించి, ప్రజల మధ్య ద్వేషం ప్రబలకుండా వుండాలని చేసిన ప్రయత్నం.

        నక్సలైట్లకు, పోలీసులకు మధ్య నలిగిపోతున్న ప్రజల శాంతియుత జీవనం కోసం శ్రీ ఎస్.ఆర్.శంకరన్  గారి నాయకత్వంలో ప్రభుత్వాన్నీ, విప్లవరాజకీయ పార్టీల నాయకులను శాంతి చర్చలకు ఒప్పించటం, నక్సలైట్లు ఆయుధాలను అడవులలో వదలి హైదరాబాద్ రావటం. జిల్లెళ్లమూడి అమ్మతో అనుబంధం వల్ల నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి పరిణామం. జీవితం అంతా విధి నడిపించటమే అనే విశ్వాసం ఏర్పడటం.

        ఇంకా... జిన్నగారికి చుట్ట కాల్చే అలవాటు లేకపోతే హైదరాబాద్ సంస్థాన భవిష్యత్తు మరొక విధంగా ఉండేదా? శ్రీశైలం ప్రాజెక్టు కోసం నీలం సంజీవరెడ్డి గారి ధర్మాగ్రహం, శ్రీ వెంకటేశ్వరస్వామికి రాయలవారు ఇచ్చిన కిరీటం కథాకమామిషు. పత్రికారంగం పరిణామ దశలు, మనసున్న ఎందరో మంచి మనుషులు. అధికార దండధరుల తీరు తెన్నులు మొదలైన మరెన్నో విశేషాలు ఇందులో వున్నాయి.

                                                                              - పొత్తూరి వెంకటేశ్వరరావు

 

         

        ఎనభై సంవత్సరాలు దాటిన వయస్సులో ఒక తెలుగు జర్నలిస్టు వెనుదిరిగి చూసుకొన్నప్పుడు స్మృతిపథంలో మొదలైన జీవితానుభవాల మాలిక ఈ స్వీయ చరిత్ర. ఒక చిన్న పత్రికలో ఒక చిన్న ఉద్యోగంతో మొదలై, పెద్ద పత్రికలో సంపాదకత్వం వరకు సాగిన మూడున్నర దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానం. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పాత పత్రికల డిజిటైజేషన్. తెలంగాణ ప్రజల అస్మితను, ఆకాంక్షను, రాష్ట్ర విభజన అనివార్యతను గుర్తించి 1969 నుంచి 2014లో రెండు రాష్ట్రాలు ఏర్పడేవరకూ రచయిత చేసిన యథాశక్తి కృషి, రెండు రాష్ట్రాల ఏర్పాటు ఉభయ ప్రాంతాలకు శ్రేయస్కరమని విశ్వసించి, ప్రజల మధ్య ద్వేషం ప్రబలకుండా వుండాలని చేసిన ప్రయత్నం.         నక్సలైట్లకు, పోలీసులకు మధ్య నలిగిపోతున్న ప్రజల శాంతియుత జీవనం కోసం శ్రీ ఎస్.ఆర్.శంకరన్  గారి నాయకత్వంలో ప్రభుత్వాన్నీ, విప్లవరాజకీయ పార్టీల నాయకులను శాంతి చర్చలకు ఒప్పించటం, నక్సలైట్లు ఆయుధాలను అడవులలో వదలి హైదరాబాద్ రావటం. జిల్లెళ్లమూడి అమ్మతో అనుబంధం వల్ల నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి పరిణామం. జీవితం అంతా విధి నడిపించటమే అనే విశ్వాసం ఏర్పడటం.         ఇంకా... జిన్నగారికి చుట్ట కాల్చే అలవాటు లేకపోతే హైదరాబాద్ సంస్థాన భవిష్యత్తు మరొక విధంగా ఉండేదా? శ్రీశైలం ప్రాజెక్టు కోసం నీలం సంజీవరెడ్డి గారి ధర్మాగ్రహం, శ్రీ వెంకటేశ్వరస్వామికి రాయలవారు ఇచ్చిన కిరీటం కథాకమామిషు. పత్రికారంగం పరిణామ దశలు, మనసున్న ఎందరో మంచి మనుషులు. అధికార దండధరుల తీరు తెన్నులు మొదలైన మరెన్నో విశేషాలు ఇందులో వున్నాయి.                                                                               - పొత్తూరి వెంకటేశ్వరరావు            

Features

  • : Vidhi Na Saradhi
  • : Potturi Venkateswara Rao
  • : Emesco publishers
  • : EMESCO0094
  • : Paperback
  • : 2015
  • : 382
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vidhi Na Saradhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam