తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస. అది కలిగినవాడు జిజ్ఞాసువు. ఎల్ల దేశాలలోనూ, ఎల్లకాలాలలోనూ అలాంటివారు ఉంటూనే ఉంటారు. కొందరు జిజ్ఞాసువులు తెలుసుకోవాలనుకున్నది అంతో ఇంతో తెలియడంతో అదే చాలనుకుంటారు. మరికొందరు తాము తెలుసుకొన్నదానిని మరేదో లక్ష్యం చేరుకోవడానికి ఉపయోగించుకుంటారు. కొద్దిమంది తాము తెలుసుకున్నదానిని సమాజహితం కోసం వినియోగించాలని ప్రయత్నిస్తారు. జిజ్ఞాస వల్ల సాధించేది జ్ఞానం. అది ఏ రంగానికి చెందినదైనా కావచ్చు. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, వైజ్ఞానిక రంగాలలో మానవుడు సాధించిన జ్ఞానం ప్రపంచాన్ని మార్చివేసింది.
మహిమలు ఉన్నాయా లేవా అనే విచికిత్సతో చదివిన గ్రంథాలనుంచి "రహస్య జ్ఞానం" పదాల కూర్పు జరిగింది. కన్ఫ్యూషియస్ కాలం నుంచి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకు మానవాళిని ప్రభావితం చేసిన, ఇంకా తాత్త్వికసిద్ధాంతాలను గురించి ఒక అధ్యయనం ఈ గ్రంథంలో చేరింది. ఈ పదకోశం స్వగ్రామం కాదు. నేను వ్రాసిన అర్థాలు లోపరహితమైనవని నేను చెప్పలేను. పునర్ముద్రణలో సవరించడానికి అవకాశాలు ఉన్నాయి గనుక, అచ్చుతప్పులు గానీ, మరేవైనా పొరపాట్లుగానీ ఉన్నట్లయితే తెలియచేయవలసిందని వాటిని గమనించిన సహృదయులకు ప్రార్థన. జిజ్ఞాసువులకు, పారమార్థిక గ్రంథాలు పఠించాలనుకునే ఉత్సాహులకూ ఈ పదకోశం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస. అది కలిగినవాడు జిజ్ఞాసువు. ఎల్ల దేశాలలోనూ, ఎల్లకాలాలలోనూ అలాంటివారు ఉంటూనే ఉంటారు. కొందరు జిజ్ఞాసువులు తెలుసుకోవాలనుకున్నది అంతో ఇంతో తెలియడంతో అదే చాలనుకుంటారు. మరికొందరు తాము తెలుసుకొన్నదానిని మరేదో లక్ష్యం చేరుకోవడానికి ఉపయోగించుకుంటారు. కొద్దిమంది తాము తెలుసుకున్నదానిని సమాజహితం కోసం వినియోగించాలని ప్రయత్నిస్తారు. జిజ్ఞాస వల్ల సాధించేది జ్ఞానం. అది ఏ రంగానికి చెందినదైనా కావచ్చు. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, వైజ్ఞానిక రంగాలలో మానవుడు సాధించిన జ్ఞానం ప్రపంచాన్ని మార్చివేసింది. మహిమలు ఉన్నాయా లేవా అనే విచికిత్సతో చదివిన గ్రంథాలనుంచి "రహస్య జ్ఞానం" పదాల కూర్పు జరిగింది. కన్ఫ్యూషియస్ కాలం నుంచి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకు మానవాళిని ప్రభావితం చేసిన, ఇంకా తాత్త్వికసిద్ధాంతాలను గురించి ఒక అధ్యయనం ఈ గ్రంథంలో చేరింది. ఈ పదకోశం స్వగ్రామం కాదు. నేను వ్రాసిన అర్థాలు లోపరహితమైనవని నేను చెప్పలేను. పునర్ముద్రణలో సవరించడానికి అవకాశాలు ఉన్నాయి గనుక, అచ్చుతప్పులు గానీ, మరేవైనా పొరపాట్లుగానీ ఉన్నట్లయితే తెలియచేయవలసిందని వాటిని గమనించిన సహృదయులకు ప్రార్థన. జిజ్ఞాసువులకు, పారమార్థిక గ్రంథాలు పఠించాలనుకునే ఉత్సాహులకూ ఈ పదకోశం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.