'యాజ్ఞసేని అంటే యజ్ఞం నుంచి పుట్టినది. యజ్ఞసేనుని కుమార్తె కూడా. ఆమె కృష్ణ అనే మరో పేరున్న ద్రౌపది... ఆమె తన కథ తానే చెప్పుకుంటే అందులో ఆమె అంతరంగ ఆవిష్కరణ ఎలా ఉంటుందో దాన్ని ప్రతిభావంతంగా నిర్వహించిన నవల యాజ్ఞసేని. యాజ్ఞసేని స్త్రీత్వానికే మారు పేరు. కర్మ, జ్ఞానం, శక్తి మూర్తీభవించిన దేవి. ప్రపంచంలో యాజ్ఞసేని వలె యాతన, అవమానం, మానసిక సంకటం, సంఘర్షణ అనుభవించిన స్త్రీ ఇప్పటివరకూ జన్మించలేదు.
ద్రౌపది పేరు 'కృష్ణ' అని కూడా ఉంది. అయితే ఓడియాలో వాడినంతగా తెలుగు సాహిత్యంలో 'కృష్ణ' అన్న పేరు వాడుకలో లేదేమో! కాని ఈ నవలలో రచయిత్రి కృష్ణ, కృష్ణుల పేర్లను ఒకేమారు వాడడం అనేకసార్లు జరిగింది. తెలుగులో కృష్ణుడిని సంబోధించేటప్పుడు 'కృష్ణా' అని సంబోధిస్తాం. అటువంటి సందర్భంలో 'ఓ కృష్ణుడా' అని వాడడం జరిగింది పాఠకులకు సందిగ్ధం కలగాకుండా ఉండాలని. ఓ స్త్రీ గురించి ఒక స్త్రీ రచించి ఇంకొక స్త్రీ అనువదించి మీ ముందు ఉంచిన నవల. అనువాదకురాలిగా మాత్రమే గాక పాఠకురాలిగా కూడా నవలను ఉత్కంఠతో చదివాను.
'యాజ్ఞసేని అంటే యజ్ఞం నుంచి పుట్టినది. యజ్ఞసేనుని కుమార్తె కూడా. ఆమె కృష్ణ అనే మరో పేరున్న ద్రౌపది... ఆమె తన కథ తానే చెప్పుకుంటే అందులో ఆమె అంతరంగ ఆవిష్కరణ ఎలా ఉంటుందో దాన్ని ప్రతిభావంతంగా నిర్వహించిన నవల యాజ్ఞసేని. యాజ్ఞసేని స్త్రీత్వానికే మారు పేరు. కర్మ, జ్ఞానం, శక్తి మూర్తీభవించిన దేవి. ప్రపంచంలో యాజ్ఞసేని వలె యాతన, అవమానం, మానసిక సంకటం, సంఘర్షణ అనుభవించిన స్త్రీ ఇప్పటివరకూ జన్మించలేదు. ద్రౌపది పేరు 'కృష్ణ' అని కూడా ఉంది. అయితే ఓడియాలో వాడినంతగా తెలుగు సాహిత్యంలో 'కృష్ణ' అన్న పేరు వాడుకలో లేదేమో! కాని ఈ నవలలో రచయిత్రి కృష్ణ, కృష్ణుల పేర్లను ఒకేమారు వాడడం అనేకసార్లు జరిగింది. తెలుగులో కృష్ణుడిని సంబోధించేటప్పుడు 'కృష్ణా' అని సంబోధిస్తాం. అటువంటి సందర్భంలో 'ఓ కృష్ణుడా' అని వాడడం జరిగింది పాఠకులకు సందిగ్ధం కలగాకుండా ఉండాలని. ఓ స్త్రీ గురించి ఒక స్త్రీ రచించి ఇంకొక స్త్రీ అనువదించి మీ ముందు ఉంచిన నవల. అనువాదకురాలిగా మాత్రమే గాక పాఠకురాలిగా కూడా నవలను ఉత్కంఠతో చదివాను.
© 2017,www.logili.com All Rights Reserved.