ప్రముఖ రచయితలనుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంధ విమర్శలు, పరామర్శల సంకలనం.. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!! శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదివించుకున్నాను.(క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మాత్రమే అతన్ని మనం గుర్తుంచుకోవాలి -ఆరుద్ర,14.10.1986 గతం భవిష్యత్తు వర్తమానం పేరుతో నేను ఇటీవల ప్రచురించిన గ్రంధంపై శ్రీ తెలకపల్లి రవి గారు ఆగష్టు 15,1995 ప్రజాశక్తి సంచికలో సమీక్ష చేశారు. .... మధ్యేవాదం, మధ్యేమార్గం అనటమే మార్క్సిస్టు వ్యతిరేక ధోరణి అయినట్లు రవిగారు విమర్శించారు.ఈ విమర్శ అనాలోచితమని మాత్రమే నేను చెప్ప గలిగిన మాట.. గ్రంధ సమీక్షకులకు పూర్తి స్వేచ్చ వున్న మాట కాదనను. ఈ సమస్యపై వాదోపవాదాలు పెంచడమూ నా అభిప్రాయం కాదు ఏటుకూరు బలరామమూర్తి,15.8.1995 వీక్షణ - సమీక్షణ అనే పుస్తకంలోని మీ అభిప్రాయాలు సంక్షిప్తంగా వున్నా విషయ పూర్ణంగా విశ్లేషణాత్మకంగా వున్నాయి...తెలుగు సాహిత్యంలో 1965-85ల మధ్య కాలం క్షీణ దశాబ్దాలది అనే (అనంతం) వాదనతో నేనేకీభవించను. ఆ కాల పరిధిలో ఎంతో వైవిధ్యమున్న రచనలూ వచ్చాయి. మిగతా వ్యాసాలన్నీ నాకు బాగా నచ్చాయి -డా.సి.నారాయణరెడ్డి,28.1.95 .. నిన్నటి ప్రజాశక్తిలో (ఇలా మిగిలేం పై తెలకపల్లి రవి) సమీక్ష చదివాను.. అది నేను ఆశించిన స్థాయిలోనే అసలు విషయానికి పరిమితమై డిగ్నిఫైడ్ గా వుందనుకున్నాను......ఆలోచించ దగిన పాయింట్స్ వున్నాయి.... ఇలా మిగిలేం అని వాపోవలసిన వారికే అది వర్తిస్తుంది. ఎలా మిగిలాం అని గర్వపడగలిగిన స్థితిలో వున్నవారికి (మన సమీక్షరాసిన వారిలా) అది వర్తించదు గదా. అదే నా ధీమా! చలసాని ప్రసాదరావు,17.2.1992
ప్రముఖ రచయితలనుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంధ విమర్శలు, పరామర్శల సంకలనం.. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!! శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదివించుకున్నాను.(క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మాత్రమే అతన్ని మనం గుర్తుంచుకోవాలి -ఆరుద్ర,14.10.1986 గతం భవిష్యత్తు వర్తమానం పేరుతో నేను ఇటీవల ప్రచురించిన గ్రంధంపై శ్రీ తెలకపల్లి రవి గారు ఆగష్టు 15,1995 ప్రజాశక్తి సంచికలో సమీక్ష చేశారు. .... మధ్యేవాదం, మధ్యేమార్గం అనటమే మార్క్సిస్టు వ్యతిరేక ధోరణి అయినట్లు రవిగారు విమర్శించారు.ఈ విమర్శ అనాలోచితమని మాత్రమే నేను చెప్ప గలిగిన మాట.. గ్రంధ సమీక్షకులకు పూర్తి స్వేచ్చ వున్న మాట కాదనను. ఈ సమస్యపై వాదోపవాదాలు పెంచడమూ నా అభిప్రాయం కాదు ఏటుకూరు బలరామమూర్తి,15.8.1995 వీక్షణ - సమీక్షణ అనే పుస్తకంలోని మీ అభిప్రాయాలు సంక్షిప్తంగా వున్నా విషయ పూర్ణంగా విశ్లేషణాత్మకంగా వున్నాయి...తెలుగు సాహిత్యంలో 1965-85ల మధ్య కాలం క్షీణ దశాబ్దాలది అనే (అనంతం) వాదనతో నేనేకీభవించను. ఆ కాల పరిధిలో ఎంతో వైవిధ్యమున్న రచనలూ వచ్చాయి. మిగతా వ్యాసాలన్నీ నాకు బాగా నచ్చాయి -డా.సి.నారాయణరెడ్డి,28.1.95 .. నిన్నటి ప్రజాశక్తిలో (ఇలా మిగిలేం పై తెలకపల్లి రవి) సమీక్ష చదివాను.. అది నేను ఆశించిన స్థాయిలోనే అసలు విషయానికి పరిమితమై డిగ్నిఫైడ్ గా వుందనుకున్నాను......ఆలోచించ దగిన పాయింట్స్ వున్నాయి.... ఇలా మిగిలేం అని వాపోవలసిన వారికే అది వర్తిస్తుంది. ఎలా మిగిలాం అని గర్వపడగలిగిన స్థితిలో వున్నవారికి (మన సమీక్షరాసిన వారిలా) అది వర్తించదు గదా. అదే నా ధీమా! చలసాని ప్రసాదరావు,17.2.1992© 2017,www.logili.com All Rights Reserved.