డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారి కుమారుడైన శ్రీ ఆచంట జానకిరామ్ గారి జీవితం ఆసాంతం, వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన వారి స్నేహ సాంగత్యంలో సాగిపోయింది. బాల్యంలోనే తండ్రిగారి మిత్రులైన గురజాడ, వీరేశలింగం, గిడుగులాంటి ఉద్దండుల ఆప్యాయతానురాగాలు లభించడం ఆయన సుకృతం. ప్రాధమిక విద్యా దశలో అనిబిసెంట్, కజిన్స్ దంపతులు, అరుండేళ్, జస్టిస్ సదాశివ అయ్యర్ వంటి మేధావులు గురుత్వం ఆయన అదృష్టం. ఇక ఆయన సాంస్క్రుతిక జీవనంలో పరిచయాలు, స్నేహాలు గుర్తు చేసుకుంటేనే, ఒక ప్రక్క ఆశ్చర్యం, ఒక ప్రక్క అసూయ! అటువంటి వారిలో ముచ్చుకి కొన్ని పేర్లు; శ్రీమతి దుర్గాబాయ్,కమలాదేవి, కొంపెల్ల, రాజమన్నార్, సంజీవ్ దేవ్, ,ఎం.ఎస్.సుబ్బలక్ష్మి,సదాశివంమల్లంపల్లి, అబ్బూరి, దేవులపల్లి, చలం, ఇంకా ఎందరెందరో!!
శ్రీ జానకిరామ్ ఆల్ ఇండియా రెడియో కార్యక్రమాలకి చెక్కిన వన్నెలు, విశ్వకవి ఠాగూర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జరిపించిన విధానం తెలుగువారు మరచిపోకూడనివి.
శ్రీ జానకిరామ్ గాంధీజీ గురించి ప్రస్తావిస్తూ "20వ శతాబ్దిలో మహాత్మునితో పాటు ఈ భూమి మీద సహ జీవనం చెయ్యడం తను చేసుకున్న మహా పుణ్యం" అన్నారు. అట్లాగే వారి సమగ్ర రచనా సాగరం వంటి ఈ పుస్తకాన్ని పునుర్ముద్రించడం మా ఫౌండేషన్ చేస్తున్న సాహితీ కృషిలో చిన్న గర్వకారణం. ఈ పుస్తకం ఈ తరం పాఠకులాని మరిన్ని మంచి పుస్తకాలను చదివేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తూ, శ్రీ జానకీరామ్ గారి మాటలలోనే వారిది ఎటువంటి జీవితం! ఎటువంటి జీవితం!
- ఆచంట జానకీరామ్
డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారి కుమారుడైన శ్రీ ఆచంట జానకిరామ్ గారి జీవితం ఆసాంతం, వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన వారి స్నేహ సాంగత్యంలో సాగిపోయింది. బాల్యంలోనే తండ్రిగారి మిత్రులైన గురజాడ, వీరేశలింగం, గిడుగులాంటి ఉద్దండుల ఆప్యాయతానురాగాలు లభించడం ఆయన సుకృతం. ప్రాధమిక విద్యా దశలో అనిబిసెంట్, కజిన్స్ దంపతులు, అరుండేళ్, జస్టిస్ సదాశివ అయ్యర్ వంటి మేధావులు గురుత్వం ఆయన అదృష్టం. ఇక ఆయన సాంస్క్రుతిక జీవనంలో పరిచయాలు, స్నేహాలు గుర్తు చేసుకుంటేనే, ఒక ప్రక్క ఆశ్చర్యం, ఒక ప్రక్క అసూయ! అటువంటి వారిలో ముచ్చుకి కొన్ని పేర్లు; శ్రీమతి దుర్గాబాయ్,కమలాదేవి, కొంపెల్ల, రాజమన్నార్, సంజీవ్ దేవ్, ,ఎం.ఎస్.సుబ్బలక్ష్మి,సదాశివంమల్లంపల్లి, అబ్బూరి, దేవులపల్లి, చలం, ఇంకా ఎందరెందరో!! శ్రీ జానకిరామ్ ఆల్ ఇండియా రెడియో కార్యక్రమాలకి చెక్కిన వన్నెలు, విశ్వకవి ఠాగూర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జరిపించిన విధానం తెలుగువారు మరచిపోకూడనివి. శ్రీ జానకిరామ్ గాంధీజీ గురించి ప్రస్తావిస్తూ "20వ శతాబ్దిలో మహాత్మునితో పాటు ఈ భూమి మీద సహ జీవనం చెయ్యడం తను చేసుకున్న మహా పుణ్యం" అన్నారు. అట్లాగే వారి సమగ్ర రచనా సాగరం వంటి ఈ పుస్తకాన్ని పునుర్ముద్రించడం మా ఫౌండేషన్ చేస్తున్న సాహితీ కృషిలో చిన్న గర్వకారణం. ఈ పుస్తకం ఈ తరం పాఠకులాని మరిన్ని మంచి పుస్తకాలను చదివేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తూ, శ్రీ జానకీరామ్ గారి మాటలలోనే వారిది ఎటువంటి జీవితం! ఎటువంటి జీవితం! - ఆచంట జానకీరామ్© 2017,www.logili.com All Rights Reserved.