"హాయ్! నా సెల్లో కొన్ని ఫోటోలున్నాయి. కొన్ని ప్రింట్లు వెయ్యాలి. ఒకటి మాత్రం ఎన్లార్జ్ చేసి లామినేట్ చెయ్యాలి" అంటూ ఫోటో స్టుడియోని కలియజూసి, “దీనంత సైజు" అని ఒక ఫోటో చూపించింది కీర్తి.
ఆమెని ఎక్కడో చూసినట్టుగా అన్పించింది స్టుడియో సుబ్బారావుకి. అయినా మౌనంగా చేయి చాచి సెల్, కనెక్టింగ్ వైరు అందుకున్నాడు. ఫోటోల్ని తన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి మానిటర్ని ఆమె వైపు తిప్పాడు.
ఎన్లార్జ్ చెయ్యాల్సిన ఫోటో చూపించిందామె. అందులో చాలా హూందాగా అందంగా ఉన్న ఓ యువకుడు ఒక మోకాలు నేల మీద ఆన్చి కూర్చుని, మెరుపుతీగలా వున్న కీర్తికి గులాబీ ఇస్తుంటే ఆమె ముచ్చటగా మురిపెంగా చూస్తోంది!
సుబ్బారావు చూపుల్లో పోగుబడిన ఆశ్చర్యం చూసి కిలకిలా నవ్వింది. "మేం అంత బాగున్నామా?”
ఆ ఫోటో అంటే ఆమెకెంతో ఇష్టం. అందుకే పెద్ద సైజులో వేయించుకుని తన ఇంటి హాలులో పెట్టుకోవాలనుకుంది.
"అపురూప జంటలా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచదర్ అనుకోండి. మీరొప్పుకుంటే దీని కాపీని మా స్టుడియోలో పెట్టుకుంటాను. దానికి బదులుగా మీకిది ఊరికే వేసిస్తాను” “అలాగా!” కనుబొమలు చిత్రంగా ఎగరేసి కొంటెగా నవ్వింది. కళ్ళల్లో మెరుపులు
వెలుగుతోంటే గబగబా సుధీర్ కి ఫోన్ చేసింది.
"హాయ్ సుధీర్, స్టుడియో నుంచి ... అహ ఆ స్టుడియో కాదు, ఫోటో స్టుడియో నుంచి. నువ్వు ప్రపోజ్ చేసినప్పటి ఫోటో ప్రింటు వేయిద్దామనొచ్చాను. మన జోడీ అదిరిందిట. నేను అనుమతిస్తే పబ్లిసిటీ కోసం స్టుడియోలో పెట్టుకుంటా!"
"వాడేమిటి ఎవడైనా అదేమాట అంటాడు. భూమ్మీద మనలాంటి బ్యూటిఫుల్ జంట లేదని బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఉయార్ లక్కీ కపుల్ యార్" "చిన్న సవరణ. మనమింకా కపుల్స్మి కాలేదు...”
"ఎంగేజ్మెంట్ అయిందిగా, సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇంక రేపు మన......................
"హాయ్! నా సెల్లో కొన్ని ఫోటోలున్నాయి. కొన్ని ప్రింట్లు వెయ్యాలి. ఒకటి మాత్రం ఎన్లార్జ్ చేసి లామినేట్ చెయ్యాలి" అంటూ ఫోటో స్టుడియోని కలియజూసి, “దీనంత సైజు" అని ఒక ఫోటో చూపించింది కీర్తి. ఆమెని ఎక్కడో చూసినట్టుగా అన్పించింది స్టుడియో సుబ్బారావుకి. అయినా మౌనంగా చేయి చాచి సెల్, కనెక్టింగ్ వైరు అందుకున్నాడు. ఫోటోల్ని తన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి మానిటర్ని ఆమె వైపు తిప్పాడు. ఎన్లార్జ్ చెయ్యాల్సిన ఫోటో చూపించిందామె. అందులో చాలా హూందాగా అందంగా ఉన్న ఓ యువకుడు ఒక మోకాలు నేల మీద ఆన్చి కూర్చుని, మెరుపుతీగలా వున్న కీర్తికి గులాబీ ఇస్తుంటే ఆమె ముచ్చటగా మురిపెంగా చూస్తోంది! సుబ్బారావు చూపుల్లో పోగుబడిన ఆశ్చర్యం చూసి కిలకిలా నవ్వింది. "మేం అంత బాగున్నామా?” ఆ ఫోటో అంటే ఆమెకెంతో ఇష్టం. అందుకే పెద్ద సైజులో వేయించుకుని తన ఇంటి హాలులో పెట్టుకోవాలనుకుంది. "అపురూప జంటలా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచదర్ అనుకోండి. మీరొప్పుకుంటే దీని కాపీని మా స్టుడియోలో పెట్టుకుంటాను. దానికి బదులుగా మీకిది ఊరికే వేసిస్తాను” “అలాగా!” కనుబొమలు చిత్రంగా ఎగరేసి కొంటెగా నవ్వింది. కళ్ళల్లో మెరుపులు వెలుగుతోంటే గబగబా సుధీర్ కి ఫోన్ చేసింది. "హాయ్ సుధీర్, స్టుడియో నుంచి ... అహ ఆ స్టుడియో కాదు, ఫోటో స్టుడియో నుంచి. నువ్వు ప్రపోజ్ చేసినప్పటి ఫోటో ప్రింటు వేయిద్దామనొచ్చాను. మన జోడీ అదిరిందిట. నేను అనుమతిస్తే పబ్లిసిటీ కోసం స్టుడియోలో పెట్టుకుంటా!" "వాడేమిటి ఎవడైనా అదేమాట అంటాడు. భూమ్మీద మనలాంటి బ్యూటిఫుల్ జంట లేదని బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఉయార్ లక్కీ కపుల్ యార్" "చిన్న సవరణ. మనమింకా కపుల్స్మి కాలేదు...” "ఎంగేజ్మెంట్ అయిందిగా, సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇంక రేపు మన......................© 2017,www.logili.com All Rights Reserved.