"24 గంటల సమయంలో మనం ఏం చేస్తున్నాం?" అనే విషయమే మన జీవితం, ఆనందం, ఆరోగ్యం, సక్సెస్, ఆయుష్షులను డిసైడ్ చేస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ ప్రపంచంలో 24గంటల కాలం అనేది ఎవరికైనా ఒకటే...
ఆమెరికా ప్రెసిడెంట్ అయినా అప్పడాలు అమ్ముకునే వ్యక్తికి అయినా 24గంటలే కాలం...
ఈ 24గంటల టైమ్ ను మీరు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారు? అనేది అత్యంత ముఖ్యమైన విషయం...
ఈ రోజుల్లో చుడండి జనం ఉరుకులు, పరుగులు పెడుతూఉంటారు. ఓ పది సెకన్లు కూడా సిగ్నల్ దగ్గర వెయిట్ చేయకుండా రెడ్ లైట్ వెలుగుతుండగానే సిగ్నల్ జంపింగ్ చేసేస్తారు. ప్రక్కనే పొంచి వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకోగానే అరగంట సేపు బ్రతిమాలాడతారు. పది సెకన్లు వెయిట్ చేయలేని వ్యక్తి అరగంట కాలం మనశ్శాంతి, డబ్బులను వృధా చేస్తున్నాడు అంటే 'ఎంత ముర్ఖత్వమో' అర్ధం అవుతుంది. ఈ హడావుడి కారణంగానే బీపి, షుగర్, అల్సర్లు, గుండె జబ్బులు...
టైం ఎప్పుడూ మన చేతుల్లో వుండదు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ నిద్ర, కెరీర్, అలవాట్లు, టైంపాస్, రిలాక్సేషన్, వ్యసనాలు, కబుర్లు ఇవన్ని మాత్రమె కచ్చితంగా మన చేతుల్లోనే ఉంటాయని మీరు అంగికరిస్తారనుకుంటాను.
సక్సెస్ లో టైం మేనేజ్మెంట్ అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. తమతమ రంగాల్లో సక్సెస్ ను సాధించిన ప్రముఖలను పరిశీలిస్తే వాళ్ళు 'టైం' కు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో అర్ధం అవుతుంది.
- ఆదెళ్ళ శివకుమార్
"24 గంటల సమయంలో మనం ఏం చేస్తున్నాం?" అనే విషయమే మన జీవితం, ఆనందం, ఆరోగ్యం, సక్సెస్, ఆయుష్షులను డిసైడ్ చేస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో 24గంటల కాలం అనేది ఎవరికైనా ఒకటే... ఆమెరికా ప్రెసిడెంట్ అయినా అప్పడాలు అమ్ముకునే వ్యక్తికి అయినా 24గంటలే కాలం... ఈ 24గంటల టైమ్ ను మీరు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారు? అనేది అత్యంత ముఖ్యమైన విషయం... ఈ రోజుల్లో చుడండి జనం ఉరుకులు, పరుగులు పెడుతూఉంటారు. ఓ పది సెకన్లు కూడా సిగ్నల్ దగ్గర వెయిట్ చేయకుండా రెడ్ లైట్ వెలుగుతుండగానే సిగ్నల్ జంపింగ్ చేసేస్తారు. ప్రక్కనే పొంచి వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకోగానే అరగంట సేపు బ్రతిమాలాడతారు. పది సెకన్లు వెయిట్ చేయలేని వ్యక్తి అరగంట కాలం మనశ్శాంతి, డబ్బులను వృధా చేస్తున్నాడు అంటే 'ఎంత ముర్ఖత్వమో' అర్ధం అవుతుంది. ఈ హడావుడి కారణంగానే బీపి, షుగర్, అల్సర్లు, గుండె జబ్బులు... టైం ఎప్పుడూ మన చేతుల్లో వుండదు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ నిద్ర, కెరీర్, అలవాట్లు, టైంపాస్, రిలాక్సేషన్, వ్యసనాలు, కబుర్లు ఇవన్ని మాత్రమె కచ్చితంగా మన చేతుల్లోనే ఉంటాయని మీరు అంగికరిస్తారనుకుంటాను. సక్సెస్ లో టైం మేనేజ్మెంట్ అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. తమతమ రంగాల్లో సక్సెస్ ను సాధించిన ప్రముఖలను పరిశీలిస్తే వాళ్ళు 'టైం' కు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో అర్ధం అవుతుంది. - ఆదెళ్ళ శివకుమార్© 2017,www.logili.com All Rights Reserved.