సమాజం మారటంలో మహిళలు పోషించిన పాత్ర, వారి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి మహిళా ఉద్యమాలతో పాటు, సాధారణ ఉద్యమాలను కూడా అధ్యయనం చేయాలి. వాస్తవానికి సాధారణ ఉద్యమాలలో భాగంగా కొన్నిసార్లు, మహిళా అంశాలపై లేదా పితృస్వామ్యంపై పోరాటాలు జరిగాయి. అలాగే అనేకసార్లు మహిళా ఉద్యమాలు కూడా సాధారణ అంశాలను చేపట్టాయి. ఇది ఒక గతి తార్కిక సంబంధం. ఈ అన్ని రకాల అణిచివేత దోపిడీలపై పోరాడకుండా మహిళల విముక్తి సాధ్యం కాదు. వాస్తవానికి సాధారణ అంశాలపై తిరుగుబాట్ల నుంచే మహిళా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాబట్టి మార్పు కోసం మహిళలు చేపట్టిన పోరాటాల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల ఉద్యమాల గురించి అధ్యయనం చెయ్యాలి. అందుకు ఈ పుస్తకం ఎంతో దోహదం చేస్తుంది.
సమాజం మారటంలో మహిళలు పోషించిన పాత్ర, వారి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి మహిళా ఉద్యమాలతో పాటు, సాధారణ ఉద్యమాలను కూడా అధ్యయనం చేయాలి. వాస్తవానికి సాధారణ ఉద్యమాలలో భాగంగా కొన్నిసార్లు, మహిళా అంశాలపై లేదా పితృస్వామ్యంపై పోరాటాలు జరిగాయి. అలాగే అనేకసార్లు మహిళా ఉద్యమాలు కూడా సాధారణ అంశాలను చేపట్టాయి. ఇది ఒక గతి తార్కిక సంబంధం. ఈ అన్ని రకాల అణిచివేత దోపిడీలపై పోరాడకుండా మహిళల విముక్తి సాధ్యం కాదు. వాస్తవానికి సాధారణ అంశాలపై తిరుగుబాట్ల నుంచే మహిళా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాబట్టి మార్పు కోసం మహిళలు చేపట్టిన పోరాటాల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల ఉద్యమాల గురించి అధ్యయనం చెయ్యాలి. అందుకు ఈ పుస్తకం ఎంతో దోహదం చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.