ఆది శంకరాచార్య, స్వామీ వివేకానంద, శ్రీనివాస రామానుజన్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్...
మార్టిన్ లూధర్ కింగ్, యూరీ గగారిన్, జాన్ కిట్స్, షెల్లీ, బ్రూస్ లీ... కన్నెగంటి హన్మంతు, భండారు అచ్చమాంబ, బసవరాజు అప్పారావు, దామెర్ల రామారావు... లాంటి చరిత్ర నిర్మాతలెందరో మీతో మాట్లాడతారీ పుస్తకంలో!
వీరంతా 40ఏళ్లలోపు మరణించినవారే!
ఎలా పుట్టామన్నది కాదు. ఎందుకు పుట్టామన్నది ముఖ్యం.
ఎందుకు చనిపోతామన్నది కాదు. ఎలా వెళ్లిపోతామన్నది ప్రధానం.
కడుపుకి తిండి, కంటికి నిద్ర, వేళకి పడక సుఖం... ఇందుకోసమే ఐతే - జంతువుగానే పుట్టొచ్చు.
మానవ జన్మ ఎందుకూ - దండగ, ఎలా పుట్టిందో అలాగే ఉండి - పోయే గుణం జంతువుది.
మనిషి అలా కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు.
అలా చరిత్ర గతిని మార్చిన వారి జీవిత కధలివి. వీరికి వారసుడిని నీవు. ఉండి - పోయే గుణంలో ఉండిపోవద్దు. ఇంతింతై మరియు దానంతై... ఆకాశం కంటె, మేఘమండలం కంటె.
ధ్రువతారల కంటె, మహార్లోకం కంటె... ఎదిగి ఎదిగి సత్యలోకం చేరుకో!
తనను తాను ఉద్ధరించుకుంటూ - మొత్తంగా సంఘాన్నేఉద్ధరించగల శక్తి ఒక్క మనిషికే ఉంది.
మానవజాతి ఉద్ధరణకి తోడ్పడిన వారి జీవితాలూ అనుభవాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి.
వీరూ సామాన్యంగానే పుట్టారు. కానీ అసామాన్యంగా ఎదిగారు.
అందుకే వీరి విజయాలు - సముద్ర తీరపు సైకత ముద్రలు కావు.
కాలమనే సాగరం విజ్రంభించినా చెరగని ముద్రలు.
- ఆకెళ్ళ రాఘవేంద్ర
ఆది శంకరాచార్య, స్వామీ వివేకానంద, శ్రీనివాస రామానుజన్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్... మార్టిన్ లూధర్ కింగ్, యూరీ గగారిన్, జాన్ కిట్స్, షెల్లీ, బ్రూస్ లీ... కన్నెగంటి హన్మంతు, భండారు అచ్చమాంబ, బసవరాజు అప్పారావు, దామెర్ల రామారావు... లాంటి చరిత్ర నిర్మాతలెందరో మీతో మాట్లాడతారీ పుస్తకంలో! వీరంతా 40ఏళ్లలోపు మరణించినవారే! ఎలా పుట్టామన్నది కాదు. ఎందుకు పుట్టామన్నది ముఖ్యం. ఎందుకు చనిపోతామన్నది కాదు. ఎలా వెళ్లిపోతామన్నది ప్రధానం. కడుపుకి తిండి, కంటికి నిద్ర, వేళకి పడక సుఖం... ఇందుకోసమే ఐతే - జంతువుగానే పుట్టొచ్చు. మానవ జన్మ ఎందుకూ - దండగ, ఎలా పుట్టిందో అలాగే ఉండి - పోయే గుణం జంతువుది. మనిషి అలా కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. అలా చరిత్ర గతిని మార్చిన వారి జీవిత కధలివి. వీరికి వారసుడిని నీవు. ఉండి - పోయే గుణంలో ఉండిపోవద్దు. ఇంతింతై మరియు దానంతై... ఆకాశం కంటె, మేఘమండలం కంటె. ధ్రువతారల కంటె, మహార్లోకం కంటె... ఎదిగి ఎదిగి సత్యలోకం చేరుకో! తనను తాను ఉద్ధరించుకుంటూ - మొత్తంగా సంఘాన్నేఉద్ధరించగల శక్తి ఒక్క మనిషికే ఉంది. మానవజాతి ఉద్ధరణకి తోడ్పడిన వారి జీవితాలూ అనుభవాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. వీరూ సామాన్యంగానే పుట్టారు. కానీ అసామాన్యంగా ఎదిగారు. అందుకే వీరి విజయాలు - సముద్ర తీరపు సైకత ముద్రలు కావు. కాలమనే సాగరం విజ్రంభించినా చెరగని ముద్రలు. - ఆకెళ్ళ రాఘవేంద్ర© 2017,www.logili.com All Rights Reserved.