నైనా ఒక మనిషి కాదు,
ఒక భావన, ఒక ఆశయం, ఒక ఆదర్శం -
ఆ ఆదర్శాన్ని భూమికి దించే ఆచరణలో అంతర్భాగం!
ఆమె - రైఫిల్, ఎ.కె.సైతాలిన్ పేల్చగలదు.
గురి చూసి శత్రువు మీదకు గ్రనేడ్ విసరగలదు.
గెరిల్లా దళానికి నైనా - నయనం లాంటిది.
ఆమె దళ కమాండర్!
భుజంగరావుగారికి ప్రియమైన 'నైనా' మీ ముందు వస్తోంది. భుజంగరావుగారి విస్తారమైన అనుసృజనలేగాక సృజనాత్మక సాహిత్యం తెలుగు పాఠకలోకానికి సుపరించితమే.
ఆయన రాసిన దాదాపు ఇరవై కధలు 'అరణ్యపర్వం' అనే సంకలనంగానూ, తన సహచరుడు, ప్రాణమిత్రుడైన శారద(నటరాజన్) జీవితాన్ని 'సాహిత్య బాటసారి శారద' గానూ, భుజంగరావు గారే స్వయంగా జీవితమంతా యుద్ధం చేసి, ఆ జీవితాన్ని లొంగదీసి తన చేతుల్లోకి తీసుకున్న పోరాటాన్ని 'గమనా గమనం', 'గమ్యం దిశగా గమనం' గానూ వెలువరించారు.
ఆయన గమ్యమైన సమసమాజం కోసం - ఆయన తన గమనాన్ని తానే నిర్దేశించుకుని సాగించిన జీవితంలో తోడైన వ్యక్తులు, కలిసి నడిచిన కామ్రేడ్స్ ఎందరో! అందులోని కొన్ని అనుభవాలు 'నైనా', 'ప్రజలు అజేయులు' వంటి రచనలు ప్రోత్సాహం.
నైనా ఒక మనిషి కాదు, ఒక భావన, ఒక ఆశయం, ఒక ఆదర్శం - ఆ ఆదర్శాన్ని భూమికి దించే ఆచరణలో అంతర్భాగం! ఆమె - రైఫిల్, ఎ.కె.సైతాలిన్ పేల్చగలదు. గురి చూసి శత్రువు మీదకు గ్రనేడ్ విసరగలదు. గెరిల్లా దళానికి నైనా - నయనం లాంటిది. ఆమె దళ కమాండర్! భుజంగరావుగారికి ప్రియమైన 'నైనా' మీ ముందు వస్తోంది. భుజంగరావుగారి విస్తారమైన అనుసృజనలేగాక సృజనాత్మక సాహిత్యం తెలుగు పాఠకలోకానికి సుపరించితమే. ఆయన రాసిన దాదాపు ఇరవై కధలు 'అరణ్యపర్వం' అనే సంకలనంగానూ, తన సహచరుడు, ప్రాణమిత్రుడైన శారద(నటరాజన్) జీవితాన్ని 'సాహిత్య బాటసారి శారద' గానూ, భుజంగరావు గారే స్వయంగా జీవితమంతా యుద్ధం చేసి, ఆ జీవితాన్ని లొంగదీసి తన చేతుల్లోకి తీసుకున్న పోరాటాన్ని 'గమనా గమనం', 'గమ్యం దిశగా గమనం' గానూ వెలువరించారు. ఆయన గమ్యమైన సమసమాజం కోసం - ఆయన తన గమనాన్ని తానే నిర్దేశించుకుని సాగించిన జీవితంలో తోడైన వ్యక్తులు, కలిసి నడిచిన కామ్రేడ్స్ ఎందరో! అందులోని కొన్ని అనుభవాలు 'నైనా', 'ప్రజలు అజేయులు' వంటి రచనలు ప్రోత్సాహం.
© 2017,www.logili.com All Rights Reserved.