వచనమూ, కవిత్వమూ రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. కవిత్వం మాట నేను వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది. కవిత్వంతో చాలా చిక్కు. ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి ఒక్కసారి రావచ్చు. వారంలో నాలుగు సార్లు రావచ్చు. వచ్చినప్పుడే ముద్దు చెయ్యాలి. నాకు ముక్కు మీద కోపం ఉన్నప్పుడో, నేను బెంగతో నిట్టూర్చినపుడో, కంటికొసలన నీటి బొట్లు తళుక్కుమన్నప్పుడో ఎలా వస్తుందో, నా ముందు వాలిపోతుంది. ఆమె పరామర్శకు చిహ్నాలే 'పంచమ వేదం', 'నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి' కవితా సంకలనాలు. ఇప్పుడు కోపం, బెంగా, దుఃఖం కలగలసిపోయాయి. కవిత్వం నన్ను వదలనన్నది. ఫలితమే ఈ 'ఆది పర్వం'.
- సతీష్ చందర్
వచనమూ, కవిత్వమూ రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. కవిత్వం మాట నేను వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది. కవిత్వంతో చాలా చిక్కు. ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి ఒక్కసారి రావచ్చు. వారంలో నాలుగు సార్లు రావచ్చు. వచ్చినప్పుడే ముద్దు చెయ్యాలి. నాకు ముక్కు మీద కోపం ఉన్నప్పుడో, నేను బెంగతో నిట్టూర్చినపుడో, కంటికొసలన నీటి బొట్లు తళుక్కుమన్నప్పుడో ఎలా వస్తుందో, నా ముందు వాలిపోతుంది. ఆమె పరామర్శకు చిహ్నాలే 'పంచమ వేదం', 'నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి' కవితా సంకలనాలు. ఇప్పుడు కోపం, బెంగా, దుఃఖం కలగలసిపోయాయి. కవిత్వం నన్ను వదలనన్నది. ఫలితమే ఈ 'ఆది పర్వం'. - సతీష్ చందర్© 2017,www.logili.com All Rights Reserved.