అంబేద్కర్ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ట్రకు చెందిన వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృషిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు.పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడానికి ఆయన సమర్పించిన థీసిస్ ఈ గ్రంథం. అంబేద్కర్ కృషి గురించి ఇంతటి సమగ్రమైన, తులనాత్మకమైన గ్రంథం బహుశా ఇంతవరకు వెలువడకపోయి ఉండవచ్చు. ముమ్మరంగా సామాజికోద్యమాలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో సరైన దృక్పథం ఏర్పరుచుకునేందుకు ఈ గ్రంథం ఎంతగానో దోహదపడుతుంది.
అంబేద్కర్ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ట్రకు చెందిన వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృషిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు.పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడానికి ఆయన సమర్పించిన థీసిస్ ఈ గ్రంథం. అంబేద్కర్ కృషి గురించి ఇంతటి సమగ్రమైన, తులనాత్మకమైన గ్రంథం బహుశా ఇంతవరకు వెలువడకపోయి ఉండవచ్చు. ముమ్మరంగా సామాజికోద్యమాలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో సరైన దృక్పథం ఏర్పరుచుకునేందుకు ఈ గ్రంథం ఎంతగానో దోహదపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.