బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి చాలా పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. అయన రచనలు కూడా కొన్ని విదేశీభాషలు మొదలుకొని, దాదాపు అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. కొంతమంది నాయకుల్లా అయన జీవితం రహస్యమైనది కాదు. తన చుట్టూ ఉన్న సమాజంతో మమేకమై ఈ దేశ చరిత్రకు ఒక చోదకశక్తిగా పనిచేసి, సామాన్య పౌరులకు రాజ్యాంగ హక్కులను కల్పించిన ఎంతో ఉదాత్తమైనది . అణిచివేతలు, తిరస్కరణలు, దూషణలు, నిందలు, తన జీవన పయనంలో ఎన్నింటినో ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడా వెన్నుచూపని సాహసి అయన. అంబేద్కర్ జీవితం తెరిచిన పుస్తకం. అయితే అయన రాసిన ఒక వాక్యాన్నో, చేసిన ఒక పోరాటాన్నో, ఆయన జీవితంలోని ఒక సంఘటననో పట్టుకుని ఆయనని సమగ్రంగా తెలుసుకున్నామనుకుంటే అది చాలా పొరపాటు. అంబేద్కర్ మోహున్నత వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఈ పుస్తకం కూడా చాలదు. కానీ నేటి తరానికి అయన జీవిత విశేషాలను , వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిని కొంత పరిమిత మేరకైనా గుర్తు చేయడానికే ఈ ప్రయత్నం.